Actress : నన్ను నేను కోల్పోయాను.. అతడి మరణం నన్ను పూర్తిగా మార్చేసింది.. బిగ్ బాస్ బ్యూటీ..

ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా సాగుతుంది. అలాగే హిందీలో బిగ్ బాస్ సీజన్ 19 రన్ అవుతుంది. ఇప్పటివరకు ఈషోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో అతి తక్కువ మందికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈషోలో తమ ఆట తీరుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న కంటెస్టెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ ఒకరు.

Actress : నన్ను నేను కోల్పోయాను.. అతడి మరణం నన్ను పూర్తిగా మార్చేసింది.. బిగ్ బాస్ బ్యూటీ..
Shehanaz

Updated on: Nov 12, 2025 | 6:04 PM

బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది మంది అభిమానులను గెలుచుకుంది. అమాయకత్వం.. మొండితనం.. ప్రేమ.. జెన్యూన్ ఆట తీరుతో అడియన్స్ కు దగ్గరయ్యింది. అదే సమయంలో తన తోటి కంటెస్టెంట్ తో ప్రేమలో పడింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కాలం చేతిలో ఇద్దరూ ఒడిపోయారు. అతడి మరణంతో ఆమె పూర్తిగా మారిపోయింది. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ పేరు షెహనాజ్ గిల్. ఈ పేరు చెబితే గుర్తుపట్టనివారుండరు. హిందీలో బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొంది. ఇందులో తన ఆట తీరు, అమాయకత్వంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

అయితే ఈ షోలో తన తోటి కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో పడింది. వీరిద్దరి జోడికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ సిద్ధార్థ్ శుక్లా 2021లో గుండెపోటుతో మరణించారు. అతడి మరణంతో షెహనాజ్ పూర్తిగా కుంగిపోయింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సిద్ధార్థ్ మరణం తర్వాత తన అమాయకత్వాన్ని కోల్పోయానని.. చెప్పుకొచ్చింది. “ఇప్పుడు నేను చాలా మారిపోయాను. సిద్ధార్థ్ నన్ను ఎంతో మార్చాడు. లేదంటే నేను ఒకప్పటి బిగ్ బాస్ 13 అమ్మాయిగానే ఉండిపోయేదాన్ని. కానీ సిద్ధార్థ్ మరణం నేను పూర్తిగా కోల్పోయాను. నా సంతోషం, సరదా అన్ని పోగొట్టుకున్నాను. సిద్ధార్థ్ వెళ్లిపోయిన తర్వాత అమాయకమైన షెహనాజ్ లేదు ” అంటూ చెప్పుకొచ్చింది.

Sidharth

ఇప్పటికీ సోషల్ మీడియాలో మా ఇద్దరి గురించి వచ్చే రీల్స్ చేస్తుంటాను. వాటిని చూసినప్పుడు, నేను ఎంత దూరం వచ్చాను.. ఎంత మారిపోయాను అని ఆశ్చర్యపోతుంటాను. ఒకప్పుడు షెహనాజ్ భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు నా భావోద్వేగాలు చాలా మారిపోయాయి. బిగ్ బాస్ తర్వాత నేను చండీగఢ్‌కి తిరిగి వెళ్లాలనుకున్నాను. కానీ సిద్ధార్థ్ నన్ను ముంబైలో ఆపాడు. అప్పుడు నాకు ముంబైలో ఏమి తెలియదు. కానీ అతడు నన్ను పూర్తిగా మార్చేశాడు. నా కెరీర్ నిర్మించుకునేలా చేశాడు. నా లైఫ్, కెరీర్ క్రెడిట్ మొత్తం అతడికే అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?