Bigg Boss 10 Telugu : వామ్మో.. త్యాగాలు.. ఎమోషన్లు.. బిగ్ బాస్ ఇంటిని ముంచెత్తిన కన్నీళ్లు!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు సీజన్ 10లో ఒక మినీ ఫ్యామిలీ వీక్ ప్లాన్ చేశారు. బుధవారం నాటి ఎపిసోడ్ లో త్యాగాలు, ఎమోషన్లతో నిడిపోయింది. ముఖ్యంగా తమ ఇంటి వారిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు హౌస్మేట్స్. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్ లో అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా.

Bigg Boss 10 Telugu : వామ్మో.. త్యాగాలు.. ఎమోషన్లు.. బిగ్ బాస్ ఇంటిని ముంచెత్తిన కన్నీళ్లు!
Bigg Boss 10 Telugu Updates

Updated on: Sep 24, 2026 | 10:48 AM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికర మలుపులతో సాగుతోంది. సెప్టెంబరు 23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్ ఎమోషన్లు, వివాదాలు, కామెడీ , సీరియస్ గొడవలతో నిండిపోయింది. ‘టెంప్టేషన్స్ వర్సెస్ టెన్షన్’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లు తమ కుటుంబ సభ్యుల లేఖలు, ఫోటోల కోసం పడిన ఆరాటం ప్రేక్షకులను ఏడిపించేసింది. కంటెండర్‌షిప్ టాస్క్‌లో భాగంగా దేబ్‌జానీకి వచ్చిన ఇంటి లేఖ క్రాష్ అయిపోవడంతో ఆమె తీవ్రంగా భావోద్వేగానికి లోనై ఏడ్చేసింది. లెటర్ పోయినందుకు బాధపడుతున్న దేబ్జానీని ఓదార్చడానికి రాంప్రసాద్, నరేష్, రోహిత్‌లు ప్రయత్నించారు. రాంప్రసాద్ సరదాగా “మీ చెల్లి రాసిన అక్షరాల్లా ఉన్నాయి.. నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం, నీకు నెలకు రెండు లక్షలు కావాలా?” అంటూ దేబ్జానీని నవ్వించే ప్రయత్నం చేశారు. మరోవైపు, ముకేశ్‌కి తన తండ్రితో ఉన్న పాత జ్ఞాపకాల ఫోటో రావడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

కిచెన్ డ్యూటీలో వంశీ, దేబ్‌జానీ వంట చేస్తుండగా త్రిగుణ్ వారితో అనవసరంగా మాట్లాడుతున్నాడని ఝాన్సీ అసహనం వ్యక్తం చేసింది. “వంట చేసేటప్పుడు మాట్లాడకూడదు” అని ఆమె అనడంతో, “అయితే నోటికి ప్లాస్టర్ వేయండి” అంటూ త్రిగుణ్ సమాధానమిచ్చాడు. దీంతో బిగ్‌బాస్ నిజంగానే ప్లాస్టర్ పంపించడం, ఝాన్సీ స్వయంగా త్రిగుణ్, వంశీల నోటికి ప్లాస్టర్ వేయడం ఎపిసోడ్‌లో నవ్వులు పూయించింది. ఈ ఎపిసోడ్‌లో ప్రధానమైన హైలైట్ ‘గెలుపు కొమ్మలు’ టాస్క్ . గార్డెన్ ఏరియాలో వర్షిణి, అమన్ ల్యాప్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్విమ్మింగ్ పూల్ నుంచి మూటలు తెచ్చి స్టాండ్ మీద విసిరే క్రమంలో, వర్షిణి పాయింట్ సాధించకుండా ఆపేందుకు అమన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అమన్, వర్షిణిని గట్టిగా పట్టుకోవడంతో (హగ్ చేసుకోవడం) అది వివాదంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

దేబ్జానీతో సహా కంటెస్టెంట్లు అమన్ ప్రవర్తనను తప్పుపట్టారు.. టాస్క్ నెపంతో ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం సరికాదని వర్షిణి తీవ్రంగా బాధపడిం. అయితే అమన్ వర్గంలోని త్రిగుణ్ మాత్రం “ఆడపిల్ల అనే పాయింట్‌ను బయటకు తీసి అమన్‌ను తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు” అంటూ సూటిగా మాట్లాడాడు. మొత్తానికి ఎపిసోడ్ మాత్రం కన్నీళ్లతో నిండిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Loading...
Unable to load recommendations.
Follow Us