Bhola Shankar: యూట్యూబ్‌‌ను షేక్ చేస్తోన్న మెగాస్టార్.. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతోన్న భోళా మేనియా

స్వర సాగర్ మాస్‌ బీట్‌కు.. చిరు చేసిన గ్రేస్‌ ఫుల్ డ్యాన్స్‌ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. అప్పటికే నెలకొని ఉన్న అంచనాల మధ్యలో..! ఆ సినిమా వైపే చూస్తున్న మెగా ఫ్యాన్స్ సాక్షిగా...! ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన టైటిల్ సాంగ్ టీజర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Bhola Shankar: యూట్యూబ్‌‌ను షేక్ చేస్తోన్న మెగాస్టార్.. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతోన్న భోళా మేనియా
Bhola Shankar

Updated on: Jun 05, 2023 | 8:25 PM

యూట్యూబ్‌ మొత్తం భోళా శంకర్ యుఫోరియాతో ఊగిపోతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు అందర్నీ ఊగిపోయేలా చేస్తోంది. స్వర సాగర్ మాస్‌ బీట్‌కు.. చిరు చేసిన గ్రేస్‌ ఫుల్ డ్యాన్స్‌ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. అప్పటికే నెలకొని ఉన్న అంచనాల మధ్యలో..! ఆ సినిమా వైపే చూస్తున్న మెగా ఫ్యాన్స్ సాక్షిగా…! ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన టైటిల్ సాంగ్ టీజర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఊర మాసు బీట్‌కు.. మెగా స్టార్ గ్రేస్‌ తోడై.. చూడ ముచ్చటగా ఈ సాంగ్ సాగుతోంది.

యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటుంది. జెస్ట్ 24 గంటల్లోనే దాదాపు 10 మిలియన్ రియల్ టైం వ్యూస్‌ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. యూట్యూబ్‌ మ్యూజిక్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమాపై కూడా ఒక్క సారిగా అంచనాలను కూడా పెంచేలా చేసుకుంది.

ఇక మెహర్ రమేష్‌ డైరెక్షన్లో.. చిరు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్. అజిత్ హీరోగా … తమిళ్ లో వచ్చిన వేదాలం మూవీకి రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే బయటికి వచ్చిన చిరు లుక్‌ అందర్నీ తెగ ఆకట్టుకుంది. మరో సారి వింటేజ్ చిరును గుర్తు చేస్తూనే.. సినిమా హిట్ అనే పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూ.. తాజాగా రిలీజ్‌ అయిన ఫస్ట్ సింగిల్ ఈ మూవీని మరోసారి ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.