Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది భీమ్లా నాయక్ చిత్ర యూనిట్.  పవన్ కళ్యాణ్, రానా(Rana) హీరోలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న..

Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ... బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..
Bheemla Nayak Release Date

Updated on: Feb 15, 2022 | 10:10 PM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది భీమ్లా నాయక్ చిత్ర యూనిట్.  పవన్ కళ్యాణ్, రానా(Rana) హీరోలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్ ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈరోజు చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది.

మలయాళంలో సూపర్‌హిట్‌గా మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ పోలీస్ ఆఫీసర్ గా రానా డానియల్ రౌడీ పాత్రలో నటిస్తున్నారు. పవన్ సరసన  నిత్యామేనన్‌, రానా కు జోడీగా సంయుక్త మీనన్ లు కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సహా రిలీజైన అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భీమ్లా నాయక్ తొలి సింగిల్, టీజర్, రానా పాత్ర డానియల్ శేఖర్ టీజర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. త్రివిక్రమ్ మాటలను అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అయితే మరో మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా సినిమా గని కూడా ఫిబ్రవరి 25న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపద్యంలో ఒకే తేదీతో మెగా హీరోలైన పవన్ , వరుణ్ లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు.

Also Read:

 సమతామూర్తిని సందర్శించే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి….