Bheemla Nayak: భీమ్లా నాయక్ బాక్సాఫీస్(Box Office) వద్ద సందడి చేస్తోంది. పవన్ కళ్యాణ్(pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati)కలిసి నటించిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన భీమ్లానాయక్ ఎనిమిది రోజుల్లో రూ. 170 కోట్ల వసూలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారత్ లోనే కాదు యూఎస్‌లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో డాలర్ల వర్షం కురిపిస్తూ పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.
తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్న భీమ్లా నాయక్: అజిత్ కుమార్, వాలిమై, అలియా భట్ గంగూబాయి కతియావాడి లతో పాటు ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లా నాయక్ రిలీజయింది. వాటిని బీట్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం 200 కోట్ల రూపాయల మార్క్‌కు చేరువలో ఉంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయబాలన్ భీమ్లానాయక్ బాక్సాఫీస్ వసూళ్లను ప్రకటించారు.
భీమ్లానాయక్ బాక్సాఫీస్ డే 1 – 61.24 కోట్లు, 2వ రోజు – 32.51 కోట్లు, రోజు 3 – 34.63 కోట్లు, 4వ రోజు – 13.70 కోట్లు, 5వ రోజు – 15.35 కోట్లు, 6వ రోజు – 8.10 కోట్లు, రోజు 7 – 5.2.2. cr, మొత్తం – 170.74 cr (sic)ని ప్రకటించాడు.
#BheemlaNayak WW Box Office
Day 1 – ₹ 61.24 cr
Day 2 – ₹ 32.51 cr
Day 3 – ₹ 34.63 cr
Day 4 – ₹ 13.70 cr
Day 5 – ₹ 15.35 cr
Day 6 – ₹ 8.10 cr
Day 7 – ₹ 5.21 cr
Total – ₹ 170.74 cr#PawanKalyan— Manobala Vijayabalan (@ManobalaV) March 4, 2022
భీమ్లా నాయక్ మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా తెలుసులో తెరకెక్కించారు.
Also Read: