బెంగాల్ టైగర్స్ పవరేంటో రియా చూపిస్తుంది...అవును ఇప్పుడు ఇలాంటి సినిమా డైలాగులతో రెచ్చిపోతున్నారు రియా తరుపు లాయర్ సతీష్ మానేషిండే . బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం నిత్యం వార్తల్లో నానుతూనే ఉంది. అందులో డ్రగ్స్ కోణం రోజుకో మలుపు తిరుగుతుంది. కేసుకు రాజకీయ రంగు పులముకోవడంతో మరింత హీట్ పెరిగింది. సుశాంత్‌ది ఆత్మహత్యేనని ఎయిమ్స్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా అనుమానాలకు అడ్డుకట్టపడలేదు. బుధవారం రియాకు ముంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మానేషిండే తీవ్ర వ్యాఖ్యలతో సెంటర్ ఆఫ్ టాపిక్ అయ్యారు. అసలు ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే క్యాంపెయిన్ వట్టి బోగస్ అని పేర్కొన్నారు.
‘విచారణలో చివరకు ఏం తేలుతుందో తెలియాలంటే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచి చూడాలి. అంతే కానీ సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు, ఎయిమ్స్ వైద్యులపై కొంతమంది పసలేని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్లుగా ఎయిమ్స్ రిపోర్టు రాకపోవడంతో మళ్లీ మళ్లీ ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ సుశాంత్ అనేది ఒక బోగస్ ప్రచారం…’ అని మానేషిండే ఫైరయ్యారు. కొన్ని మీడియా చానళ్లు, పేపర్లు, మ్యాగజీన్లు రియాని లేడీ విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బెంగాల్ టైగర్స్ పవరేంటో రియా చూపిస్తుందని. హేటర్స్ అందరినీ బుద్ధి వచ్చేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ( గో కార్టింగ్ ప్రమాదం, యువతి దుర్మరణం )