Barrelakka Sirisha: బిగ్‌ బాస్‌ ఆఫర్‌పై స్పందించిన బర్రెలక్క.. కారు ఎవరిచ్చారో కూడా చెప్పేసిన శిరీష

|

Nov 23, 2023 | 4:47 PM

తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో బర్రెలక్క అలియాస్‌ శిరీష కూడా ఒకరు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ యువతి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సైతం ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ బర్రెలక్క పేరు మార్మోగిపోతోంది.

Barrelakka Sirisha: బిగ్‌ బాస్‌ ఆఫర్‌పై స్పందించిన బర్రెలక్క..  కారు ఎవరిచ్చారో కూడా చెప్పేసిన శిరీష
Barrelakka Sirisha
Follow us on

ప్రస్తుతం తెలంగాణ అంతటా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. ఎక్కడ చూసినా నాయకుల కటౌట్లు, పార్టీల పోస్టర్లే కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రధాన పార్టీలే అయినప్పటికీ చాలా చోట్ల స్వతంత్ర్య అభ్యర్థులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అలా తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో బర్రెలక్క అలియాస్‌ శిరీష కూడా ఒకరు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ యువతి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సైతం ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ బర్రెలక్క పేరు మార్మోగిపోతోంది. ఇదిలా ఉంటే శిరీష్‌కు బిగ్‌ బాస్‌ రియాల్టి షో నుంచి ఆఫర్‌ వచ్చిందని, ఓ ఖరీదైన కారు కూడా పంపించారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై శిరీష స్పందించింది. ‘బిగ్‌బాస్‌ వాళ్లు నన్ను ఇప్పటి వరకు సంప్రదించలేదు. బహుశా నా గురించి వారికి తెలియదేమో అనుకుంటున్నాను. వారి దగ్గరి నుంచి నాకు ఎటువంటి ఫోన్‌ కాల్స్‌, మెసేజులు రాలేదు. అలాగే నాకు ఖరీదైన కారు కొనిచ్చారన్నది పూర్తిగా అవాస్తవం. నేను ఇబ్బంది పడుతున్నా అని అన్నవాళ్లు నడుపుతున్న కార్లు తీసుకొచ్చి ప్రచారానికి వాడుకోమన్నారు. ఒక కారు మాత్రం ఒక అన్న ఉచితంగా ఇచ్చాడు’ అని స్పష్టం చేసింది శిరీష. తద్వారా తనపై వస్తోన్న బిగ్‌ బాస్‌ రూమర్లు వొట్టివేనని కుండ బద్దలు కొట్టేసింది.

‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, జాబ్స్‌ రావడం లేదు. ఈ విషయం మా అమ్మకు చెబితే నాలుగు బర్రెలను కొనిచ్చింది. బర్రెలను కాయడానికి వచ్చినా ఫ్రెండ్స్‌’ అంటూ సుమారు ఏడాదిన్నర క్రితం శిరీష చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష బీకాం వరకు చదువుకుంది. తల్లి అనురాధ ఓ చిన్న టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ శిరీషతో పాటు మరో ఇద్దరు కుమారులను చదివించింది. వీరందరూ ఓ చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని తన కుటుంబానికి పెద్ద దిక్కులా నిలబడాలనకుంది శిరీష. పోలీస్‌ కానిస్టేబుల్, ఇతర సర్కారీ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయ్యింది. అయితే ఎన్ని డిగ్రీలు వచ్చినా నోటిఫికేషన్లు రావడం లేదంటూ 2021 సెప్టెంబర్‌లో శిరీష చేసిన వీడియో తెగ వైరలైంది. పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచే శిరీష బర్రెలక్కగా బాగా ఫేమస్ అయిపోయింది.

ఇవి కూడా చదవండి

బర్రెలెక్కను ఫేమస్ చేసిన వీడియో

ఎన్నికల ప్రచారంలో శిరీష..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..