Bappi Lahiri : లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి అంత్యక్రియలు ముగిశాయి. విల్‌పార్లే పవన్ హన్స్ స్మశానవాటికలో.. తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు కుమారుడు. సంగీత దిగ్గజానికి చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు పలువురు ప్రముఖులు. ముంబైలోని ఆయన నివాసం లాహిరీ హిల్స్ నుంచి విలేపార్లే స్మశానవాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. దారి పొడవునా పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు బప్పీలహరికి అశ్రునివాళులర్పించారు. మంగళవారం అర్థరాత్రి బప్పీలహరి కన్నుమూశారు. దశాబ్దాల పాటు మ్యూజిక్ ప్రపంచంలో రారాజుగా వెలిగిన బప్పి అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బప్పీలహరి మృతితో ఫిల్మిండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. డిస్కోకింగ్‌కు అంతిమ నివాళి అర్పించేందుకు అభిమానులు పోటెత్తారు.
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సహా మొత్తం భారత దేశ సంగీతాభిమానులను తన మ్యూజిక్‌తో అలరించిన బప్పీలహరి.. ముంబైలోని బ్రీచ్ కాండీ హస్పిటల్‌లో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన కంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న ఈ గోల్డ్ మ్యాన్ అంతిమయాత్ర ముంబైలోని ఆయన ఇంటి నుంచి బంధు మిత్రలు , శ్రేయోభిలాషులు, మరియు అభిమానుల మధ్య ప్రత్యేక వాహనంతో బయలు దేరింది. దారి మధ్యలో అభిమానులు బప్పీలహరి జిందాబాద్ అంటూ నినాదాలు మిన్నంటాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈయనకు నివాళులు అర్పించింది. ఈయన పార్ధివ దేహాన్ని ముంబైలోని పవన్ హన్స్ శ్మశన వాటికకు చేరింది. ఆయన కుమారుడు బప్పీలహరి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన పాటగాడు…ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచిన సంగీత దర్శకుడు బప్పీలహరి. సంగీతంతో శ్రోతలను డిస్కో ఆడించే రింగ్ మాస్టర్…గానంతో మెస్మరైజ్ చేసి, సెన్సేషన్ క్రియేట్ చేసే డిస్కో సింగర్…సంగీతం, పాటలతోనే కాదు తనదైన ప్రత్యేక గెటప్ తోనూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఆ సంగీత దర్శకుడు..
మరిన్ని ఇక్కడ చదవండి :