Bangkok Pilla: భూకంపంలో ఇల్లు డ్యామేజ్.. నెలలోపే కొత్త విల్లాలోకి బ్యాంకాక్ పిల్ల.. అసలు విషయమిదే.. వీడియో

గత నెలలో సంభవించిన భారీ భూకంపాల కారణంగా మయన్మార్, బ్యాంకాక్, థాయిల్యాండ్ వంటి దేశాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భవనాలు, నివాసాలు నేల మట్టం కావడంతో కోట్లాది మంది ప్రజులు రోడ్డున పడ్డారు. ఈ భూకంప బాధితుల్లో భారతీయులు కూడా చాలా మందే ఉన్నారు.

Bangkok Pilla: భూకంపంలో ఇల్లు డ్యామేజ్.. నెలలోపే కొత్త విల్లాలోకి బ్యాంకాక్ పిల్ల.. అసలు విషయమిదే.. వీడియో
Bangkok Pilla Alias Sravani

Updated on: Apr 22, 2025 | 7:53 PM

 

గత నెలలో మయన్మార్, బ్యాంకాక్, థాయిల్యాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. దీంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ భూకంప బాధితుల్లో ప్రముఖ తెలుగు యూట్యూబర్ శ్రావణి అలియాస్ బ్యాంకాక్ పిల్ల కూడా ఉంది. భారీ భూకంపం కారణంగా బ్యాంకాక్ పిల్ల ఉంటున్న అపార్ట్మెంట్‌ బాగా డ్యామేజ్ అయ్యింది. కూలీ పోలేదు కానీ భారీగా బీటలు వారింది. దీంతో అది ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉండడంతో అక్కడ నివాసం ఉండే వారందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించింది. దీంతో బ్యాంకాక్ పిల్ల కూడా తన ఇంటిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమెనే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది. ‘ తట్టా బుట్టా తో రోడ్డున పడ్డాం’ అంటూ ఆమె అప్లోడ్ చేసిన వీడియో నెట్టింట బాగా వైరలయ్యింది. దీంతో శ్రావణి పరిస్థితిని చూసి ఆమె అభిమానులు, సబ్‌స్క్రైబర్లు బాగా ఫీల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో మరో వీడియోను అప్ లోడ్ చేసింది బ్యాంకాక్ పిల్ల. అందులో బ్యాంకాక్ సిటీకి కాస్త దూరంలో ఒక పెద్ద విల్లాను చూపిస్తూ తాము అందులోకి షిఫ్ట్ అయిపోయామని చెప్పుకొచ్చింది. అంతే కాదు తన సబ్‌స్క్రైబర్లందరికీ ఆ విల్లాను మొత్తం తిప్పి చూపించింది. సోఫా, టీవీ, వాషింగ్ మెషీన్‌తో పాటు ఆ విల్లాలో అన్ని సౌకర్యాలు ముందు నుంచే ఉన్నాయని అందులో చూపించింది. కేవలం బట్టలు సర్దుకొని వచ్చేశామని బ్యాంకాక్ పిల్ల చెప్పింది.

కొత్త విల్లాను చూపిస్తోన్న బ్యాంకాక్ పిల్ల.. ఫుల్ వీడియో

అద్దెకు తీసుకుని..

అయితే ఇదే వీడియోలో విల్లాకు సంబంధించిన ఓనర్లు కూడా కనిపించారు. దీంతో బ్యాంకాక్ పిల్ల ఆ విల్లాను అద్దెకు తీసుకుందని తెలుస్తోంది. ఎలాగైతేనేం..శ్రావణి కొత్త ఇంట్లోకి చేరడంతో తన సబ్‌స్క్రైబర్లంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.

ఈసారైనా బిగ్ బాస్ లోకి వస్తుందా?

కాగా ఏపీలోని ఓ ప్రాంతానికి చెందిన శ్రావణి తన భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ కు వెళ్లి అక్కడే స్థిర పడిపోయింది. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు యూ ట్యూబర్ గా మారింది. బ్యాంకాక్ లో ఉండే స్థితిగతులు, అక్కడి మార్కెట్, పర్యాటక ప్రదేశాలు, అక్కడి ప్రజల జీవన విధానంపై వీడియోలు చేస్తూ   మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె యూట్యూబ్ ఛానెల్ కు సుమారు 20 లక్షలకు పైగా  సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు బ్యాంకాక్ పిల్ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.