రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన నటుడు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన నటుడు
Ram Charan

Updated on: Dec 07, 2025 | 10:29 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన సినిమాతో ఒక్కరిగా టాలీవుడ్ ను షేక్ చేశాడు బుచ్చిబాబు సన. ఆతర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు బుచ్చిబాబు.. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో రానున్నాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ తో ఈ సినిమా కథను రెడీ చేశాడు. ఈ సినిమా లో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నడు. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా నుంచి విడుదలైన చిక్కిరి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యూట్యూబ్ లో ఈ సాంగ్ షాక్ చేస్తుంది. ఇప్పటికే వంద మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉంటే పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నేను నటించాను అని చెప్పా అని ఓ నటుడు షాక్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమా ఛాన్స్ వస్తే నో చెప్పా అన్నాడు ఇంతకూ అతను ఎవరంటే..

పబ్లిక్ స్టార్ గా యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న బండి సరోజ్ కుమార్. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. తన మొదటి మూడు సినిమాలన్నీ నేరుగా యూట్యూబ్ లోనే రిలీజయ్యాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. అలాగే మోగ్లీ సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను చాలా సినిమాలను రిజెక్ట్ చేశా అని చెప్పారు. చాలా సినిమాల్లో కీలక పాత్రల కోసం సంప్రదిస్తే నో చెప్పను అని తెలిపాడు. అలాగే పెద్ది సినిమాలో కీలక పాత్ర కోసం ఆఫర్ వస్తే నో చెప్పాను అని తెలిపాడు. సరోజ్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు పెద్ది సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఆ పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని చెప్పారు. నేను ఎప్పటికీ సహాయక  పాత్రలు చేయకూడదు అని అనుకున్నాను. కానీ నన్ను ఈ పాత్ర కోసం అడిగినందుకు థాంక్యూ అని సున్నితంగా రిజెక్ట్ చేశా అని తెలిపారు. అయితే ఆ సినిమాను రిజెక్ట్ చేసినా కూడా తన పరాక్రమం ఈవెంట్ కు బుచ్చిబాబు ఏమి మనసులో పెట్టుకోకుండా హాజరైనట్లు తెలిపాడు సరోజ్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.