Bhagavanth kesari: బాక్సాఫీస్‌పై బాలయ్య దండయాత్ర.. ‘భగవంత్‌’ రికార్డు కలెక్షన్లు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

|

Oct 23, 2023 | 2:10 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి అదరగొడుతున్నాడు. భారీ అంచనాలతో దసరా కానుకగా గురువారం (అక్టోబర్‌ 19)న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్రలో నటించింది.

Bhagavanth kesari: బాక్సాఫీస్‌పై బాలయ్య దండయాత్ర.. భగవంత్‌ రికార్డు కలెక్షన్లు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Bhagavanth Kesari Movie
Follow us on

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి అదరగొడుతున్నాడు. భారీ అంచనాలతో దసరా కానుకగా గురువారం (అక్టోబర్‌ 19)న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్రలో నటించింది. మొదటి షో నుంచే పాజిటిట్‌ టాక్‌ రావడంతో ఈ సినిమా వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనికి తోడు వీకెండ్‌, దసరా సెలవులు వరుసగా రావడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ముగిసేటప్పటికీ భగవంత్‌ కేసరి ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.75 కోట్లు షేర్‌, రూ.83 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. కాగా బాలయ్య సినిమాకు ఓవర్సీస్‌లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా ఈ సినిమా 1 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఈ అరుదైన మార్క్‌ను చేరుకోవడం బాలయ్యకు వరుసగా ఇది మూడోసారి. ఇంతకు ముందు బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు కూడా 1 మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను అందుకున్నారు. తాజాగా భగవంత్‌ కేసరితో హ్యాట్రిక్‌ కొట్టారు. కాగా బాలయ్య జోరు చూస్తుంటే దసరా సెలవులు ముగిసేలోపే భగవంత్‌ కేసరి వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన భగవంత్‌ కేసరి సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్‌ యాక్టర్‌ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. శరత్‌ కుమార్‌, రవి శంకర్‌, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, రాహుల్‌ రవి, జాన్‌ విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌కు ఎస్‌. థమన్‌ స్వరాలు అందించారు. ఈ సినిమాలో కమర్షియల్‌ యాక్షన్‌ ఎలిమేంట్స్‌తో పాటు సమాజంలోని ఓ సున్నితమైన సమస్యను ఎంతో హృద్యంగా చూపించారు. ఇదే ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ నేలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య కనిపించగా, అతని కూతురు విజ్జీ పాప పాత్రలో శ్రీలీల మెప్పించింది

ఇవి కూడా చదవండి

ఓవర్సీస్ లోనూ అదరగొడుతోన్న బాలయ్య సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..