నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో కీలక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో గురువారం (అక్టోబర్ 19)న విడుదలైన భగవంత్ కేసరి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా సమాజంలోని సున్నితమైన కొన్ని సమస్యలను స్పృశిస్తూ ఈ సినిమాను రూపొందించడం, అందులో బాలయ్య లాంటి పక్కా కమర్షియల్ హీరో నటించడం భగవంత్ కేసరిపై ఆసక్తిని రేపుతోంది. ఇదే క్రమంగా కలెక్షన్లు పెరగడానికి దోహదం చేస్తోంది. తాజాగా భగవంత్ కేసరి కలెక్షన్లకు సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. శనివారం ముగిసేటప్పటికి బాలయ్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 71.02 కోట్లు రాబట్టిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఆదివారం, దీనికి తోడు దసరా సెలవులు వరుసగా రావడంతో భగవంత్ కేసరి వసూళ్లు త్వరలోనే వంద కోట్లు దాటుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భగవంత్ కేసరి సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. రవితేజ టైగర్ నాగేశ్వర రావు, విజయ్ దళపతి లియో సినిమాలు బరిలో ఉన్నప్పటికీ బాలయ్య సినిమాకే అత్యధిక వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్ టాక్ నడుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. శరత్ కుమార్, రవి శంకర్, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవి, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్‌కు ఎస్. థమన్ స్వరాలు అందించారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ నేలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య కనిపించగా, అతని కూతురు విజ్జీ పాప పాత్రలో శ్రీలీల మెప్పించింది.
#BhagavanthKesari బాక్స్ ఆఫీస్ ఊచకోత 🔥
71.02 CR Worldwide gross in 3 days for #DasaraWinnerKesari ❤️🔥❤️🔥❤️🔥#BlockbusterBhagavanthKesari Weekend Loading 😎💥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi… pic.twitter.com/0KOhywGIKJ
— Shine Screens (@Shine_Screens) October 22, 2023
Emotionally Intense on screen with a lot of fun off-screen😀
#BhagavanthKesari GRAND RELEASE TOMORROW🔥❤️🔥
Book your tickets now!
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @harish_peddi @sahugarapati7… pic.twitter.com/6dmJhCO4kL— Shine Screens (@Shine_Screens) October 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..