Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఊచకోత.. మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..

సంక్రాంతి పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 12 న  గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఊచకోత.. మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
Veera Simha Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2023 | 12:10 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 12 న  గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అలాగే ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఆలరించాయి. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి  హిట్ టాక్  చేసుకుంది. అన్ని ఏరియాలనుంచి వీరసింహారెడ్డి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తొలి రోజు ఈ సినిమా ఏకంగా 32 కోట్ల రూపాయలను నెట్ వసూల్ చేసింది. విడుదలైన తొలి రోజు ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును అందుకున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.

జాం, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర అన్ని చోట్లా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తొలి రోజే అన్ని ప్రదేశాల్లో కలిపి మొత్తం రూ.50 కోట్ల గ్రాస్‌ను(రూ.32 కోట్ల నెట్) అధిగమించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అమెరికాలో ఒక్కరోజే 708,000 డాలర్ల వసూళ్లను అందుకున్నట్లు అంచనా. త్వరలోనే మిలియన్ డాలర్లను అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!