Balakrishna: మరోసారి డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్న నట సింహం

|

Feb 25, 2022 | 9:20 PM

అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ, క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ఎన్బీకే 107.

Balakrishna: మరోసారి డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్న నట సింహం
Nbk
Follow us on

Balakrishna: అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ, క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ఎన్బీకే 107. బాలయ్య కెరీర్ లో ఈ మూవీ 107వ సినిమాగా  ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.  ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవలే సిరిసిల్ల టౌన్‌ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొద‌లుపెట్టారు మేక‌ర్స్‌. బాలకృష్ణ – ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.
మాస్ హీరో మ‌రియు మాస్ ద‌ర్శ‌కుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మంచి ట్రీట్ ఇవ్వ‌నున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇటీవల విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ మూవీలో
బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్  తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌, నవీన్ నూలీ ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..