Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ముగ్గురు యంగ్ హీరోలే తనయుడికి స్పూర్తి..

|

May 29, 2024 | 7:20 AM

ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో తన తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. అలాగే విశ్వక్ సేన్ తో నటించేందుకు రెడీ అని అన్నారు. తన అప్ కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుతూ అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం బాలయ్య స్పీచ్ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ముగ్గురు యంగ్ హీరోలే తనయుడికి స్పూర్తి..
Balakrishna, Mokshagna
Follow us on

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇక టీజర్, గ్లింప్స్ వీడియోస్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో తన తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. అలాగే విశ్వక్ సేన్ తో నటించేందుకు రెడీ అని అన్నారు. తన అప్ కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుతూ అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం బాలయ్య స్పీచ్ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

బాలయ్య మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక సినిమాలోని డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతానని అన్నారు. సినిమా అంటే తనకు ఫ్యాషన్ అని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఈ మూవీ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే విశ్వక్ సేన్, తాను ఒక కడుపున పుట్టకపోయిన బయట చూస్తే మాత్రం ఇద్దరిని కవలలు అంటారని అన్నారు. సినీ పరిశ్రమలో తాను కొద్దిమందితో మాత్రమే సన్నిహితంగా ఉంటానని అన్నారు. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నానని.. సినిమాకు, పాత్రకు ఎప్పటికప్పుడు కొత్తదనం తీసుకువచ్చేందుకు ట్రై చేస్తుంటాడని అన్నారు.

ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలని.. ఈ విషయం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని అన్నారు. కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. అలాగే తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. తనను స్పూర్తిగా కాకుండా సిద్ధు, అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలను స్పూర్తిగా తీసుకోవాలని చెబుతుంటానని అన్నారు. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.