Balakrishna: ఊర్వశివో రాక్షసివో ప్రీరిలీజ్ ఈవెంట్‏లో బాలయ్య ఆసక్తికర కామెంట్స్.. ‘నేనే అన్ని చేయగల్గుతాను అని అనుకోకుడదు’ అంటూ..

|

Oct 31, 2022 | 10:09 AM

అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది.

Balakrishna: ఊర్వశివో రాక్షసివో ప్రీరిలీజ్ ఈవెంట్‏లో బాలయ్య ఆసక్తికర కామెంట్స్.. నేనే అన్ని చేయగల్గుతాను అని అనుకోకుడదు అంటూ..
Balakrishna
Follow us on

నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ చూశాను చాలా బాగుంది.. సినిమా మరింత కలర్ ఫుల్ గా ఉంటుంది. నాకు ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే నా పరిమితులు నాకున్నాయి. నా అభిమానులకు.. ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై బలవంతంగా రుద్దాలని అనుకోను. ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం దర్శకులందరూ ట్రెండ్‌కి అనుగుణంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అల్లు అరవింద్ గారితో నా అనుబంధం ఇప్పటిది కాదు. రామలింగయ్యగారికి నాన్నగారంటే చనువు, భయం ఉండేది. ఆయనతో కలిసి నటించే అదృష్టం నాకు కలిగింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఓ అడది ఉంటుంది. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా కూడా స్త్రీ చేతిలోనే ఉంటుంది. కాలంతో పాటు అభిరులు మారుతున్నాయి. లివింగ్ టుగెదర్ అనో, ఎఫైర్స్ వంటివి నడుస్తున్నాయి. ఈ సినిమాలో ఏం చూపించారో నాకు తెలియదు…

ఇవి కూడా చదవండి

నేను అనేక రకరకాల పాత్రలు చేశాను. అయినా కూడా నేను చేయలేంది లేదు..అన్నీ చేయగలుగుతాను నేనే అని అనుకోకూడదు. నటన అంటే నవ్వడమో, ఏడవడమో, అరవడమో కాదు. అదొక పరకాయ ప్రవేశం. మరో ఆత్మలోకి ప్రవేశించటమే. మన హద్దులు మనకుంటాయి. అను మరింత అందంగా ఉండడటమే కాకుండా చక్కగా నటించింది. ఈ సినిమా విజయవంతం అవుతుంది అన్నారు.