Balakrishna: తెలుగులో కామెంట్రీ అదరగొట్టిన బాలయ్య.. ఐపీఎల్ 2023లో నందమూరి హీరో సందడి చూశారా ?..

|

Apr 01, 2023 | 3:15 PM

మార్చి 31న గుజరాత్ లోని అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభవేడుకలలో రష్మిక మందన్నా.. తమన్నా టాలీవుడ్ పాటలకు మాస్ స్టె్ప్పులతో ఊర్రూతలుగించారు. ఇక ఇదే వేడుకలలో పాల్గొన్న బాలయ్య కామెంటేటర్ గా మారిపోయారు.

Balakrishna: తెలుగులో కామెంట్రీ అదరగొట్టిన బాలయ్య.. ఐపీఎల్ 2023లో నందమూరి హీరో సందడి చూశారా ?..
Balakrishna
Follow us on

ఇటీవలే వీరసింహా రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓవైపు సినిమాలతో చేస్తూనే.. మరోవైపు ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు. ఆయన వ్యాఖ్యతగా వచ్చిన అన్ స్టాపబుల్ సీజన్ 2కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్య రూటు మార్చారు. ఇప్పటివరకు ప్రకటనలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే యాడ్స్ చేస్తున్నారు. అలాగే ఐపీఎల్ 2023 ప్రారంభవేడుకలలో సందడి చేశారు బాలయ్య. కేవలం పాల్గోనడమే కాదు.. తెలుగులో కామెంట్రీ అదరగొట్టారు. బాలయ్య ఎక్కడున్నా అక్కడ అన్ లిమిటేడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని మరోసారి నిరూపించారు.

మార్చి 31న గుజరాత్ లోని అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభవేడుకలలో రష్మిక మందన్నా.. తమన్నా టాలీవుడ్ పాటలకు మాస్ స్టె్ప్పులతో ఊర్రూతలుగించారు. ఇక ఇదే వేడుకలలో పాల్గొన్న బాలయ్య కామెంటేటర్ గా మారిపోయారు. చెన్నై.. గుజరాత్ మ్యాచ్ సందర్భంగా తెలుగు కామెంటరీ బాక్స్ లో కూర్చున్న బాలయ్య.. అక్కడి ఉన్నవాళ్లతో చాలా తొందరగా కలిసిపోయారు. తెలుగు, ఇంగ్లీష్ మాస్ పదాలతో కలిసి కామెంటరీ చెబుతూ అక్కడున్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్, ఆటగాళ్ల గురించే కాదు.. మిగతా స్పోర్ట్స్, ఫిట్ నెస్ లాంటి అంశాల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. క్రీడలు, శారీరకంగానే కాదు.. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయని అన్నారు. షేన్ వార్న్, పాల్ ఆడమ్స్, అనిల్ కుంబ్లే తనకు ఇష్టమైన బౌలర్లని చెప్పారు. చెన్నై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 170 స్కోరు చేస్తుందని అంచనా వేశారు. కాలేజీ చదివే రోజుల్లో తాను క్రికెట్ ఆడేవాడినని గుర్తుచేసుకున్నారు. బాలయ్య కామెంట్రీ చెబుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.