AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara: ‘దసరా’కు ఫిదా అవుతోన్న సెలబ్రిటీలు.. ప్రశంసల వర్షం కురిపించిన మహేష్‌ బాబు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన చింత్రం దసరా. మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది...

Dasara: 'దసరా'కు ఫిదా అవుతోన్న సెలబ్రిటీలు.. ప్రశంసల వర్షం కురిపించిన మహేష్‌ బాబు.
Dasara Movie
Narender Vaitla
|

Updated on: Apr 01, 2023 | 3:11 PM

Share

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన చింత్రం దసరా. మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలంగాణ నేపథ్యంలో పక్కా మాస్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీకాంత్‌ ఓదెల సినిమాను తెరకెక్కించిన తీరును ప్రశంసిస్తున్నారు.

దసరా సినిమా కలెక్షన్ల విషయానికొస్తే విడుదలైన రెండు రోజుల్లో ఏకంగా రూ. 53 కోట్లు గ్రాస్ వ‌సూళ్లను సాధించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దసరాను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా నాని, కీర్తి సురేష్‌ల నటనతో పాటు దర్శకుడు ప్రతిభకు మంచి మార్కులు వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు కూడా వచ్చి చేరారు.

ఇవి కూడా చదవండి

దసరా చిత్రంపై మహేష్‌ బాబు ప్రశంసలు కురిపించారు. ‘దసరా విషయంలో చాలా గర్వంగా ఉంది. సినిమా అద్భుతంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక మహేష్‌ చేసిన ఈ ట్వీట్‌కు చిత్ర యూనిట్ బదులిచ్చింది. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే దసరా మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ స్థాయిలో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ కెమెరా మ్యాన్‌గా పని చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పండుగ సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి శుభవార్త.
పండుగ సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి శుభవార్త.
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!