Daaku Maharaaj First Day Collections: ఇది బాలయ్య క్రేజ్ అంటే.. నటసింహం ఊచకోత.. డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

|

Jan 13, 2025 | 10:52 AM

నందమూరి బాలకృష్ణకు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. ఇప్పటివరకు సంక్రాంతి పండక్కి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు బాలయ్య. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో సత్తా చాటారు. భారీ అంచనాల మధ్య జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లలోనూ అదరగొట్టారు బాలయ్య.

Daaku Maharaaj First Day Collections: ఇది బాలయ్య క్రేజ్ అంటే.. నటసింహం ఊచకోత.. డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
Daaku Maharaj
Follow us on

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. ఎప్పటిలాగే తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి పండక్కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూలతోనే భారీగా ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా.. విలన్ పాత్రలో యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్, ట్రైలర్ తోనే ఈ చిత్రంపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగింది.

ఇదిలా ఉంటే.. తొలిరోజే సెన్సెషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది డాకు మహారాజ్. మొదటి రోజే యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అమెరికాలో నిన్న ఒక్కరోజే 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ డాకు మహారాజ్ మూవీ అదరగొట్టింది. నివేదికల ప్రకారం ఈ సినిమా నైజాం ఏరియాలో రూ.4. 7 కోట్లు వసూలు చేసింది. అలాగే క్యాడీడ్ రూ.5.25 కోట్లు, యూఏలో రూ.1.92 కోట్లు, గుంటూరు రూ.4 కోట్లు, క్రిష్ణ రూ.1.86 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.1.95 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 1.75 కోట్లు.. నెల్లూరులో రూ.1.51 కోట్లు రాబట్టినట్లుగా సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.22.31 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. మొదటిరోజే భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే అమెరికాలో టికిట్స్ ప్రీ సేల్స్ లో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో పదివేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. అమెరికాలోని దాదాపు 125 లోకేషన్లలో 350 షోలు ఫస్ట్ రోజే ప్రదర్శించారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..