Balakrishna: మరోసారి సందడి చేయనున్న అఖండ జోడీ.. కానీ అక్కడే అసలు ట్విస్ట్..

|

Feb 12, 2023 | 9:28 PM

బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలోనే కోట్ల వర్షం కురిపించిన సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ జోడీ మరోసారి రిపీట్ కాబోతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందడి.

Balakrishna: మరోసారి సందడి చేయనున్న అఖండ జోడీ.. కానీ అక్కడే అసలు ట్విస్ట్..
Balakrishna
Follow us on

ఇటీవలే వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కంటే ముందు బాలయ్య.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలోనే కోట్ల వర్షం కురిపించిన సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ జోడీ మరోసారి రిపీట్ కాబోతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందడి. ఈ జంట మరోసారి అలరించేది వెండితెరపై కాదు.. బుల్లితెరపై. బాలయ్య.. ప్రగ్యా కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేస్తున్నారు.

ప్రస్తుతం రూటు మార్చారు బాలయ్య. ఎప్పుడూ మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఆయన.. ఇటీవల టాక్ షోతో యాంకర్ గా మారి తనలోని మరో కోణాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంత విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. అలాగే ఎప్పుడూ యాడ్స్ జోలికి వెళ్లని బాలయ్య ఈమధ్య కమర్షియల్ యాడ్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఓ యాడ్ చేసిన ఆయన.. ఇప్పుడు మరో జ్యూవెల్లరీ యాడ్ చేస్తున్నరాు.

ఇవి కూడా చదవండి

బాలయ్య ప్రస్తుతం ఒక జ్యువెల్లరి కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మిడీయాలో తెగ వైరలవుతుంది. అందులో బాలయ్య పట్టు పంచెలో కనిపిస్తుండగా.. పక్కనే ప్రగ్యా జైస్వాల్ కూడా పట్టుచీరలో కనిపిస్తోంది. దీంతో వీరిద్దరు కలిసి కనిపిచండంతో మరోసారి అఖండ చిత్రం ప్రేక్షకుల కళ్ల ముందుకు వస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.