నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా థియేటర్లకు పూర్వ వైభవం తీసుకువచ్చింది. అఖండ అందించిన బ్లాక్ బస్టర్ హిట్‌తో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి మీదున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనుననాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్‌గా.. పవర్ ఫుల్ పోలీస్‌గా నటించనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ నటిస్తోండగా.. నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర కాస్త విభిన్నంగా ఉండబోతున్నందట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారట. గతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక గోపిచంద్.. రవితేజ కాంబోలో వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో నెగిటివ్ షేడ్స్ కలిగిన జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్. మరీ బాలయ్య సినిమాలో నెగిటివ్ షేడ్స్ అంటే వరలక్ష్మీ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.
Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్
Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!