
బాలయ్య అఖండ 2 సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. గతవారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో ఇప్పుడు సరికొత్త డేట్‌తో ఈ చిత్రం డిసెంబర్ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. గురువారం (డిసెంబర్ 11) రాత్రి నుంచే అఖండ 2 ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో పెంచిన రేట్లతోనే మరోసారి బుధవారం (డిసెంబర్ 10) రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా రేపు రాత్రి 8 గంటల ప్రీమియర్ షో టికెట్ ను రూ. 600గా నిర్ణయించింది. ఇక 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 చొప్పున, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకరించింది. అలాగే ప్రీమియర్ షో టికెట్ ను రూ.600 లుగా ను నిర్ణయించింది.
కాగా బోయపాటి శీను తెరకక్కించిన అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సంయుక్తా మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఆది పినిశెట్టి విలన్ గా యాక్ట్ చేయగా, బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా మర కీలక పాత్రలో మెరిసింది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
#Akhanda2 Telangana Regular Shows bookings open now 💥
Premieres bookings open Tomorrow ❤🔥
In theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 💥🔱#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman… pic.twitter.com/ejPpz8Gnnt— 14 Reels Plus (@14ReelsPlus) December 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.