Year Ender 2023: ఈ ఏడాది టెలివిజన్‌లో దుమ్మురేపేన చిన్న సినిమా.. రికార్డ్ క్రియేట్ చేసిన బలగం

ముఖ్యంగా చిన్న సినిమాల్లో బలగం సినిమా ఈ ఏడాది ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. జబర్దస్త్ తో పాటు పలు సినిమాల్లో కమెడియన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Year Ender 2023: ఈ ఏడాది టెలివిజన్‌లో దుమ్మురేపేన చిన్న సినిమా.. రికార్డ్ క్రియేట్ చేసిన బలగం
Balagam

Updated on: Dec 30, 2023 | 3:11 PM

2022 సినిమా ఇండస్ట్రీకిబాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది చాలా సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా చిన్న సినిమాల్లో బలగం సినిమా ఈ ఏడాది ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. జబర్దస్త్ తో పాటు పలు సినిమాల్లో కమెడియన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అద్భుతమైన కథతో తెరకెక్కిన బలగం సినిమా థియేటర్స్ లోనూ మెప్పించింది. అలాగే ఓటీటీలోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక బుల్లితెర పై కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బుల్లితెర పై ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. టాప్ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది బలగం సినిమా. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ , ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

బుల్లితెర పై బలగం సినిమా 14.21 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఎంతో మంది ఈ సినిమా చూసిన తర్వాత తమ అన్నలతో చెల్లెలతో కలిసి పోయారు. చాలా కుటుంబాల పై ఈ సినిమా ప్రభావం చూపింది. బలగం సినిమా లో ఎమోషన్స్ హైలైట్. చిన్న కథే కానీ అందరికి దగ్గరైన కథ.. ఆదరిని కదిలించే కథ. దాంతో ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరించారు.

వేణు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.