AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ప్రాణాలు పోతే బాధ్యత తీసుకుంటావా? సమంతపై మండిపడ్డ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కుంది. తన అభిమానులకు హెల్త్ టిప్స్ ఇచ్చే ప్రయత్నంలో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడామెను చిక్కుల్లో పడేసింది. సమంత ఇచ్చిన సలహాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు.

Samantha: ప్రాణాలు పోతే బాధ్యత తీసుకుంటావా? సమంతపై మండిపడ్డ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల
Samantha, Gutta Jwala
Basha Shek
|

Updated on: Jul 06, 2024 | 7:41 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కుంది. తన అభిమానులకు హెల్త్ టిప్స్ ఇచ్చే ప్రయత్నంలో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడామెను చిక్కుల్లో పడేసింది. దీనిపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా సమంతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సలహాలు వికటించి ప్రాణాలు పోతే బాధ్యత తీసుకుంటావా? అని సామ్ ను సూటిగా ప్రశ్నించింది జ్వాల. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. మయోసైటిస్ తో బాధపడుతోన్న సామ్ ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన ఫిట్ నెస్ తో పాటు హెల్త్ టిప్స్ ను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ వివాదానికి దారితీసింది. నెబ్యులైజర్ ను ఉపయోగిస్తున్న ఒక ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజర్ చేయండి’ అని సలహా ఇచ్చింది. ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. సామ్ పోస్ట్ ను చూసిన పలువురు డాక్టర్లు స్పందించారు. ఆమె చెప్పిన సలహా పాటిస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. సెలబ్రిటీ ముసుగులో ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్న సమంతను జైల్లో పెట్టాలని భగ్గుమన్నారు డాక్టర్.

ఇప్పుడిదే విషయంపై ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా ఘాటుగా స్పందించిది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందామె. జనాలకు ఆరోగ్య సూచనలుఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే ఏం చేస్తారు? దానికి మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్‌ బాధ్యత తీసుకుంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా సామ్ పై విమర్శలు కురిపించింది జ్వాల.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే