AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీకి క్యూ కట్టిన ఆఫర్స్.. ఆ యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి ?..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించగా..వైష్ణవి కథానాయికగా మెప్పించింది. ఈ ముగ్గురి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే ఈ సినిమాలో వైష్ణవి, ఆనంద్ నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. డైరెక్టర్ సాయిరాజేష్ తెరకెక్కించిన బేబి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది.

Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీకి క్యూ కట్టిన ఆఫర్స్.. ఆ యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి ?..
Vaishnavi Chaitanya
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2023 | 4:11 PM

Share

ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు వైష్ణవి చైతన్య. ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకుంది తెలుగమ్మాయి. ట్రైయాంగిల్ ప్రేమకథగా వచ్చిన బేబి సినిమా హిట్ తో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించగా..వైష్ణవి కథానాయికగా మెప్పించింది. ఈ ముగ్గురి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే ఈ సినిమాలో వైష్ణవి, ఆనంద్ నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. డైరెక్టర్ సాయిరాజేష్ తెరకెక్కించిన బేబి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. యువత నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. బేబీ హిట్ తో వైష్ణవికి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగమ్మాయికి ఛాన్స్ ఇచ్చేందుకు మేకర్స్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక యంగ్ హీరోస్ ప్రాజెక్ట్స్ కోసం వైష్ణవి పేరునే ముందుగా పరిశీలిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.తాజాగా ఈ బ్యూటీకి లక్కీ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా ఆమె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాలో అవకాశం అందుకుందని టాక్. మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యింది.

ఇక ఈ సినిమాలో రామ్ జోడిగా వైష్ణవిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. ఒక కథానాయికగా వైష్ణవిని ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా
రూ.149కే ఆన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లు.. దీపావళి వేళ శుభవార్త
రూ.149కే ఆన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లు.. దీపావళి వేళ శుభవార్త
కొత్త ఏడాది నుంచి రైల్వేలో భారీ మార్పులు.. ఈ రైళ్లలో డబ్బులు ఆదా
కొత్త ఏడాది నుంచి రైల్వేలో భారీ మార్పులు.. ఈ రైళ్లలో డబ్బులు ఆదా
వాచ్ పోగొట్టుకున్న కింగ్ కోహ్లీ.. అంపైర్ చేసిన పనికి ఫిదా..!
వాచ్ పోగొట్టుకున్న కింగ్ కోహ్లీ.. అంపైర్ చేసిన పనికి ఫిదా..!
Videos: చెత్తబుట్టలో ట్రంప్.. AI మీమ్స్‌తో నెటిజన్ల సెటైర్లు!
Videos: చెత్తబుట్టలో ట్రంప్.. AI మీమ్స్‌తో నెటిజన్ల సెటైర్లు!