
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామనామం వినిపిస్తోంది. అయోధ్యలో మరికాసేపట్లో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ లవర్స్‌కు మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించించింది. హనుమాన్ సినిమాకు ‘బై వన్ గెట్ వన్'(ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బుక్ మైషోలో ‘MIRAJBOGO’ అనే కోడ్‌ను ఉపయోగించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అయోధ్య రామోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమేనని వెల్లడించింది. ఇప్పటికీ హనుమాన్ సినిమాను చూడకపోయి ఉంటే వెంటనే మిరాజ్ సినిమాస్ ఆఫర్‌ను వెంటనే వినియోగించుకోండి అంటూ తెలిపింది.
ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో మెరిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డులు కొల్లగొట్టింది. అలాగే హనుమాన్ ప్రతి టికెట్‌పై వచ్చే 5 రూపాలయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం (జనవరి 21) ఏకంగా హనుమాన్ టికెట్లపై వచ్చిన ఆదాయంలో 2.66 కోట్ల రూపాయలను బాలరాముడికి విరాళంగా అందజేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.