AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ బుకింగ్స్ ఓపెన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

మార్వెల్ అభిమానులకు అద్దిరిపోయే న్యూస్. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ (సెప్టెంబర్ 11) ప్రారంభమయ్యాయి.

మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ బుకింగ్స్ ఓపెన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Avengers Endgame Encore
Basha Shek
|

Updated on: Sep 11, 2026 | 7:44 PM

Share

మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించనున్నారు. ముఖ్యంగా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను కూడా చూపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

‘ఎండ్‌గేమ్’ కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనం అవుతుంది. మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది. కెవిన్ ఫైజ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సెప్టెంబర్ 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో IMAX సహా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది.

సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్.. తెలుగులోనూ..

‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమా ట్రైలర్ తెలుగులో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us