Avatar: అవతార్ 2కు అవసరాల శ్రీనివాస్ కు సంబంధం ఉందట.. అది ఎలా అంటే

|

Dec 14, 2022 | 7:34 AM

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2009లో విడుదలైన 'అవతార్' మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది

Avatar: అవతార్ 2కు అవసరాల శ్రీనివాస్ కు సంబంధం ఉందట.. అది ఎలా అంటే
Avasarala Srinivas
Follow us on

ప్రస్తతం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సినిమా అవతార్ 2. లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామోరూన్ అద్భుత సృష్టి అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2009లో విడుదలైన ‘అవతార్’ మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవతార్ సినిమా తర్వాత అలాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు క్రేజ్ మరింత పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధంన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు జేమ్స్. ఇక ఇప్పుడు అవతార్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి విదులైన టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అవతార్ 2 సినిమాలో మన తెలుగు దర్శకుడు, నటుడు అయినా అవసరాల శ్రీనివాస్ కూడా భాగమయ్యారు. అదెలా అనుకుంటున్నారా..?

తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16నే విడుదల కాబోతుంది.‘అవతార్ 2’ కోసం టాలీవుడ్ దర్శకుడు.. శ్రీనివాస్ అవసరాల కూడా పని చేశాడట. ‘అవతార్’ తెలుగు వెర్షన్ కు ఆయన డైలాగ్స్ రాశారట. గతంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలకు ఇలా మన దర్శకులు డైలాగ్స్ రాయలేదు.  వాటినే తెలుగులోకి డబ్ చేసి తెలుగు వాయిస్ ఆర్టిస్ట్ లతో చదివించే వారు. అవి చాలా కామెడీగా ఉండేవి.

కానీ ఇప్పుడు అవతార్2 సినిమా  కోసం అవసరాల శ్రీనివాస్ డైలాగులు రాశారట. తనదైన కెహెలోక్తులతో పాటు ఎమోషనల్ డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారని టాక్. అయితే గతంలో  అవసరాల శ్రీనివాస్ ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వెర్షన్ కు కూడా డైలాగులు రాశాడు. ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి