Venu Swamy: వేణు స్వామి లవ్ స్టోరీ.. ఆమెను చూసిన వెంటనే అలా చేశారట..

వేణు స్వామి..! తెలుగు రాష్ట్రాల్లో ఈ జ్యోతిష్యుడి పేరు తెలియని వారు ఉండరు. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల గురించి రకరకాల కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు ఆయన. ముఖ్యంగా సెలబ్రెటీలు జాతకాలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు.

Venu Swamy: వేణు స్వామి లవ్ స్టోరీ.. ఆమెను చూసిన వెంటనే అలా చేశారట..
Venu Swamy, Veena Srivani

Updated on: Jan 02, 2026 | 12:16 PM

వేణు స్వామి .. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు ఆయన. సినీ ప్రముఖుల జాతకాలు చెపుతూ వార్తల్లో నిలిచారు వేణు స్వామి. వేణు స్వామి గురించే కాదు.. ఆయన సతీమణి గురించి కూడా చాలా మందికి తెలిసిందే ఉంటుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ వీణా కళాకారిణి, వీణా శ్రీవాణి. తన వీణా ప్రావీణ్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవాణి. పలు షోలు, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. ఆకట్టుకుంటున్నారు శ్రీవాణి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా నందంపూడిలో జన్మించిన వీణా శ్రీవాణి, చిన్నతనం నుంచే విద్యా, క్రీడలు, కళల్లో ముందుండేవారు. ఎనిమిదో తరగతిలోనే సుమ, ఝాన్సీ వంటి యాంకర్లను చూసి తాను కూడా యాంకర్ కావాలని కలలు కన్నాను అని తెలిపారు.

కెరీర్ పీక్‌లో ఉండగానే యాక్సిడెంట్‌.. కట్ చేస్తే మూడు ఏళ్లు బెడ్ రెస్ట్.. ఇప్పుడు ఫుల్ బిజీ బ్యూటీ

ఆ కలను సాకారం చేసుకోవడానికి స్థానిక కేబుల్ టీవీలో యాంకరింగ్‌ను ప్రారంభించారు. పాఠశాల నుండి సైకిల్‌పై వెళ్లి, మేకప్ చేసుకుని కార్యక్రమాలు చేసేదాన్ని.. అలా ప్రారంభమైన ఆమె ప్రయాణం, తొలి ప్రయత్నంలోనే మా టీవీలో ఎంపిక కావడంతో కీలక మలుపు తిరిగిందని అన్నారు. 2002లో సురేష్ తేజ దర్శకత్వంలో ప్రేమతో కార్యక్రమంతో కెరీర్ మొదలుపెట్టారు. మాలతీస్ డైరీ వంటి కార్యక్రమాలతో ఇంటింటికీ సుపరిచితురాలిగా మారాను అని శ్రీవాణి తెలిపారు. అదేవిధంగా 2006 నుంచి 2014 వరకు రోజుకు మూడు నాలుగు ఛానెళ్లలో పని చేస్తూ అత్యంత బిజీ యాంకర్‌గా మారారు.

చేయని తప్పుకు నాకొడుకు 10ఏళ్లు మానసికక్షోభ అనుభవించాడు.. రాజాసాబ్ నటి సెన్సేషనల్ కామెంట్స్

వీణా శ్రీవాణి  తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంటూ.. అత్తగారి సూచనల మేరకు పుస్తెల తాడును వెనక్కి పెట్టుకుంటాను అని అన్నారు. తనది ప్రేమ వివాహం అని, అప్పట్లో రైల్వేలో పని చేస్తూ వీణా క్లాసులు తీసుకుంటున్నప్పుడు తన భర్త వేణు స్వామిని కలిశానని తెలిపారు. వేణు స్వామి ఆమెను చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. వేణు స్వామి ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పేసుకున్నా అని వీణా శ్రీవాణి తెలిపారు. అలాగే  అందానికి అస్సలు ప్రాముఖ్యత ఇవ్వను. నా భర్త తిరుపతి లడ్డులాంటివారు అని ఆమె నవ్వుతూ చెప్పారు. ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు రెండు పడవల మీద కాలు పెట్టకూడదని భావించాను భావించాను అని తెలిపారు. తన భర్త, మేనమామ, అత్తగారు, తోటికోడలు అందించిన మద్దతుతో తన కెరీర్‌పై దృష్టి సారించి ముందుకు సాగారు.

ఇవి కూడా చదవండి

కష్ట సమయంలో నాకు అండగా నిలిచింది వాళ్లే.. సింగర్ శ్రావణ భార్గవి ఆసక్తికర కామెంట్స్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి