సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం.. కెరీర్ బిగినింగ్ లో సెలబ్రిటీలు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతి నటుడూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొంత మంది ఆర్టిస్టులు కూడా సక్సెస్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఓ ప్రముఖ నటుడి విషయంలోనూ అలాంటిదే జరిగింది. 20 ఏళ్ల వయసులో నటుడు అరవింద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అరవింద్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాతో పరిచయం అయ్యాడు.
ఆ సినిమా సూపర్ హిట్ నిలిచింది ఆతర్వాత అరవింద్ ‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అరవింద్ స్వామి నట జీవితంలో రజనీకాంత్ , కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులతో పోల్చేవారు. ఆ సమయంలో స్టార్ హీరోలకు ధీటుగా అరవింద్ స్వామికి క్రేజ్ ఉండేది. ఆతర్వాత అరవింద్ స్వామి సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అయ్యాయి. వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో నిరాశ చెందిన అరవింద్ నటనకు స్వస్తి చెప్పాడు. ఆ తర్వాత అరవింద్ వ్యాపారం వైపు అడుగులువేశారు. మొదట్లో అరవింద్ తన తండ్రి వ్యాపారాన్ని చేపట్టాడు. ఆ తర్వాత సొంతంగా కంపెనీ ప్రారంభించాడు.
నటనకు స్వస్తి చెప్పిన అరవింద్ తన తండ్రికి చెందిన VD స్వామి & కంపెనీని నిర్వహించడం ప్రారంభించాడు. బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు ఆరవింద్ స్వామి. ఆ తర్వాత 2005లో అరవింద్ స్వామి పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం తర్వాత 4 నుంచి 5 సంవత్సరాల వరకు చికిత్స తీసుకున్నారు. ఆతర్వాత కూడా బిజినెస్ లో రాణించాడు అరవింద్ స్వామి. ఆయన సంస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కొని 2022లో రూ. 3300 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అయితే అరవింద్‌కి నటనపై మక్కువ తగ్గలేదు. దాంతో రీఎంట్రీ ఇచ్చాడు. 2021లో కంగనా రనౌత్ నటించిన తమిళ-హిందీ చిత్రం తలైవితో అరవింద్ స్వామి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో కంగనాతో కలిసి ఎంజీ రామచంద్రన్ పాత్రను అరవింద్ పోషించారు.
It was wonderful to visit the museum and see the variety of memorabilia on display.. so well curated..congratulations and thank you 🙏 https://t.co/YxhEupqLBm
— arvind swami (@thearvindswami) November 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.