బిగ్ బాస్ సీజన్ 7 లో ఎక్కువగా సీరియల్ బ్యాచే ఉంది. హౌస్ లో ఉన్న వారిలో ప్రేక్షకులు ఎక్కువగా తిట్టుకునేది ఎవరిని అంటే చెప్పే పేరులో అమర్ దీప్ ఒకటి. మనోడు ఎదో చేస్తాడు అనుకుంటే ఏం చేయక పోగా అటు నాగార్జునతో.. ఇటు బిగ్ బాస్ తో తిట్లు తింటున్నాడు. ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటూ ఏదోరకంగా తప్పించుకుంటున్నాడు. ఇక మనోడు ఆట కూడా అంతగా ఆడటం లేదు. ప్రతి రోజు ఎపిసోడ్ లో ఎదోకరకంగా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నాడు. శివాజీ పై మొదటి నుంచి నెగిటివ్ గా ఉన్నాడు అమర్ దీప్. ఇదే విషయాన్నీ నాగార్జున ముందు కూడా చెప్పాడు. ప్రతివారం గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్తూనే ఉన్నాడు కానీ గేమ్ మాత్రం ఇంప్రువ్ చేసుకోవడం లేదు. దాంతో అమర్ దీప్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అమర్ దీప్ కు సపోర్ట్ చేసి నెటిజన్స్ చేత ట్రోల్స్ కు గురయ్యింది మాజీ బిగ్ బాస్ బ్యూటీ అరియానా. హాట్ భామ అరియానా బిగ్ బాస్ లో పాల్గొని విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా అమర్ దీప్ కు మద్దతు తెలిపింది అరియానా.
అమర్ దీప్ ఖచ్చితంగా ట్రాక్ లోకి వస్తాడు అని అంటుంది అరియానా. అమర్ దీప్ కు టైం కలిసి రావడం లేదు అని. హౌస్ లో ఉన్న వారు కాకుండా కొత్త గా వచ్చిన వారు కూడా అమర్ కు చాల కావాల్సిన వాళ్ళు. తన ఫ్రెండ్స్ తనను నామినేట్ చేయరు అర్ధం చేసుకుంటారు అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా తనను నామినేట్ చేయడంతో డిస్ట్రబ్ అయ్యాడు అని చెప్పుకొచ్చింది అరియానా. అమర్ ది మంచి తనమో వెర్రితనమో అర్ధం కావడం లేదు. లెటర్ వచ్చినప్పుడు అది చదివి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంది అరియానా. మొత్తానికి అరియానా అమర్ కు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు, నెగిటివ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. కొంత మంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నా.. చాలా మంది తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.