AR Rahman: ఆస్పత్రిలో ఏఆర్ రెహ్మాన్.. హెల్త్ బులెటిన్ విడుదల.. ఆ వార్తలను ఖండించిన ఫ్యామిలీ

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం (మార్చి 16 ఉదయం ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని వార్తలు వచ్చాయి. చెన్నైలోని అపోలో ఆసుపత్రి లో రెహమాన్ కు చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరిగింది.

AR Rahman: ఆస్పత్రిలో ఏఆర్ రెహ్మాన్.. హెల్త్ బులెటిన్ విడుదల.. ఆ వార్తలను ఖండించిన ఫ్యామిలీ
AR Rahman

Updated on: Mar 16, 2025 | 2:41 PM

ఆస్కార్ విజేత, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని, ఆయనను ఆసుపత్రిలో చేరారని ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ ఉదయం ఏఆర్ రెహమాన్ కు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చిందని, దీంతో వెంటనే ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారని కథనాలు వచ్చాయి. అయితే రెహమాన్ ఆరోగ్యంపై వస్తోన్న వార్తలను ఆయన కుటుంబీకులు ఖండించారు. ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరిన రెహమాన్… కొన్ని గంటల తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరోవైపు ఏఆర్ రెహ్మాన్ ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆప్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. డీహైడ్రేషన్ కారణంగా రెహమాన్ ఆస్పత్రిలో చేరినట్టుగా క్లారిటీ ఇచ్చింది. ‘ఈరోజు ఉదయం రెహమాన్ ఆస్పత్రికి వచ్చారు. ఆయన డీహైడ్రేషన్ లక్షణాలతో బాధపడుతున్నారు. సాధారణ చెకప్‌ తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది’ మెడికల్ బులిటెన్ లో తెలిపారు అపోలో వైద్యులు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహ్మాన్ డిశ్చార్జ్..

కాగా ఏ ఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ తన తండ్రి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకున్నాడు. ‘మా ప్రియమైన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ… మీ ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డీహైడ్రేషన్ కారణంగా మా నాన్న కొంచెం బలహీనంగా ఉన్నారు. కాబట్టి మేము ముందుగా కొన్ని సాధారణ పరీక్షలు చేయించాం. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఏఆర్ అమీన్ తెలిపాడు.

రెహ్మాన్ ఆరోగ్యంపై కుమారుడి ట్వీట్..

ఏఆర్ రెహమాన్ ఇటీవల అంతర్జాతీయ గాయకుడు ఎడ్ షీరన్‌తో కలిసి లైవ్ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్ చేతిలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. రెహమాన్ ఇప్పుడు రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రానికి సంగీతం అందించనున్నారు. అంతే కాకుండా, ఇంకా చాలా సినిమాలు ఏఆర్ రెహమాన్ చేతిలో ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి