
ముక్కల ముక్కాబులా పాట అంత ఈజీగా ఎవరైనా మరిచిపోతారా.? ఇప్పటికీ ఎక్కడ చూసిన అదే పాట వినిపిస్తూ ఉంటుంది.ఈ పాటలో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినీ ప్రేమికులను పిచ్చెక్కించాయి. ‘ప్రేమికుడు’ సినిమాలోని ఈ పాట ఇంటర్నెట్ లేని సమయంలోనే వైరల్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభుదేవా పాటకు డ్యాన్స్ చేసిన తీరు ఆయనకు మైఖేల్ జాక్సన్ ఆఫ్ ఇండియా అనే బిరుదును తెచ్చిపెట్టింది. ‘ప్రేమికుడు’ సినిమా తర్వాత AR రెహమాన్, ప్రభుదేవ్ కొన్ని చిత్రాలకు కలిసి పనిచేశారు, అయితే ఇప్పుడు ప్రభుదేవ్‌కు రెహమాన్ సంగీతం అందించి 25 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు క్రేజీ కాంబో మరోసారి కలిసి పని చేస్తున్నారు
ప్రభుదేవా, ఏఆర్ రెహమాన్ మరో ఫేమస్ మూవీ కోసం జతకట్టారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లో ప్రభుదేవా ‘ముక్కల ముక్కాబులా’ పాటకు సంబంధించిన డ్యాన్స్ స్టెప్‌ని డిజైన్ చేశారు. అంతేకాకుండా పోస్టర్‌లో ఏఆర్ రెహమాన్ చిత్రం కూడా ఉంది. బిహైండ్ వుడ్స్ 25 సంవత్సరాల తర్వాత AR రెహమాన్ , ప్రభుదేవాను ఒకచోట చేర్చి మొదటిసారిగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ప్రభుదేవా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి బిహైండ్ వుడ్స్ సీఈవో మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రభుదేవ్, ఏఆర్ రెహమాన్ కలిసి చేస్తున్న ఆరో సినిమా ఇది, ఈ సినిమాలో ఎలాంటి హింస, యాక్షన్ ఉండదు, దానికి బదులు థియేటర్‌ని రెండున్నర గంటల పాటు చాలా హ్యాపీ ప్లేస్‌గా మార్చాలనుకుంటున్నాం. సినిమాలో సంగీతం, డాన్స్ అద్భుతంగా ఉంటుంది. కామెడీ కూడా పుష్కలంగా ఉంటుందని దర్శకుడు మనోజ్ తెలిపారు. ఈ సినిమా గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘చాలా ఏళ్ల క్రితమే దీని గురించి ఆలోచించాను. సంగీతం, డ్యాన్స్, కామెడీతో సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. కానీ బిజీగా మారిపోవడంతో నేను ఆ ఆలోచనను పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ ఆలోచనను మళ్లీ తెరపైకి తెస్తున్నారు’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.