Thandel: ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా.. విచారణకు ఆదేశించిన ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. మూడు రోజుల్లోనే రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

Thandel: ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా.. విచారణకు ఆదేశించిన ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు
Thandel

Updated on: Feb 11, 2025 | 12:39 PM

సినిమా ఇండస్ట్రీలో పైరసీ భూతం మరోసారి దడపుట్టిస్తుంది. కొత్త సినిమా విడుదలైతే చాలు మధ్యాహ్నం లోగా పలు పైరసీ వెబ్ సైట్స్ లో దర్శనమిస్తున్నాయి ఈ మధ్య మరీను.. హెడీ ప్రింట్ తో సినిమాలు పైరసీ వెబ్ సైట్స్ లోకి వ చేస్తున్నాయి. పైరసీ నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు, నిర్మాతలు ప్రయత్నిస్తున్నా.. ఎదో ఒకలా సినిమాలను  పైరసీ చేస్తున్నారు. ఇక  ఈ మధ్య ఆర్టీసీ బస్సుల్లోనూ కొత్త సినిమాలను ప్లే చేస్తున్నారు. మొన్నామధ్య గేమ్ ఛేంజర్ సినిమాను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చర్చమశనీయం అయ్యింది. తాజాగా తండేల్ సినిమా  బస్సులో ప్లే చేయడం పెను సంచలనంగా మారింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించినా తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ బొమ్మ వేశారు. దీని పై నిర్మాతలు సీరియస్ అయ్యారు. సినీ  నిర్మాత  అల్లు అరవింద్, బన్నీ వాసు సినిమాను పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. పైరసీ పెద్ద క్రైమ్‌. తండేల్ సినిమాని పైరసీ చేస్తున్న వెబ్‌సైట్స్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. కేసులు పెట్టాం. మీరు జైలు వెళ్లే అవకాశం ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అలాగే బన్నీ వాసు  మాట్లాడుతూ..

కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక పైరసీ చేస్తున్నారు. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్‌ చేయొచ్చు. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం అని బన్నీ వాసు అన్నారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు. బాద్యుల పై చర్యలు తీసుకుంటామాని ఆయన తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి