టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కతుండగా..ఇందులో హీరోయిన్గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత గోపీచంద్ దర్శకుడు తేజతో, అలాగే మారుతితో సినిమాలు చేస్తున్నాడు.
మారుతి, గోపిచంద్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలో ఆర్జీవి హీరోయిన్ అప్సర రాణి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇటీవలే క్రాక్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అప్సరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ సినిమాలో కూడా కనిపించనున్నారంట. ఈ మేరకు సీటీమార్ దర్శకుడు సంపత్ నంది తెలిపారు. సీటీమార్ సెట్స్‌లోకి పటాక్ రానికి స్వాగతం అంటూ సంపత్ ట్వీట్ చేశారు. గోపీచంద్ సినిమాలోని స్పెషల్ సాంగ్‌ని కూడా మరింత స్పెషల్ చేసేందుకు అప్సరా రాని రెడీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Welcome our PATAKHA rani @_apsara_rani onboard for a yet another bombaat item number for #Seetimaarr ??
Am sure this new item will stay with you for longgg?✌?@YoursGopichand @tamannaahspeaks @DiganganaS @bhumikachawlat @soundar16 @SS_Screens #Manisharma pic.twitter.com/LIDSPfyhpB
— Sampath Nandi (@IamSampathNandi) February 18, 2021
Also Read: