సీఎం జగన్..కేరాఫ్ బాలయ్య ఫ్యాన్?

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jun 19, 2019 | 9:29 AM

అసలు ఈ వార్త నిజమో? కాదో తెలీదు కానీ వైఎస్ జగన్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక వార్త విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అది ఏంటంటే..వైఎస్ జగన్.. టాలీవుడ్ మాస్ హీరో, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక‌ృష్ణ వీరాభిమాని అని..అప్పట్లో కడప జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడని. అంతేనా బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే అప్పట్లో జగన్..భారీగా తన అభిమానాన్ని చాటుకునేవారని..పాలాభిషేకం, రక్తాభిషేకం, భారీ ఫ్లెక్స్‌లు..వాటికి మేక తలలతో గజమాలలు ఒక్కటేమిటీ?.. […]

సీఎం జగన్..కేరాఫ్ బాలయ్య ఫ్యాన్?

అసలు ఈ వార్త నిజమో? కాదో తెలీదు కానీ వైఎస్ జగన్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక వార్త విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అది ఏంటంటే..వైఎస్ జగన్.. టాలీవుడ్ మాస్ హీరో, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక‌ృష్ణ వీరాభిమాని అని..అప్పట్లో కడప జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడని. అంతేనా బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే అప్పట్లో జగన్..భారీగా తన అభిమానాన్ని చాటుకునేవారని..పాలాభిషేకం, రక్తాభిషేకం, భారీ ఫ్లెక్స్‌లు..వాటికి మేక తలలతో గజమాలలు ఒక్కటేమిటీ?.. ఇలాంటి న్యూస్ చాలానే తెలుగు రాష్ట్రాల్లో వినిపించాయి.

అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్..టీడీపీ ఎమ్మెల్యేలు అందరిలో బాలయ్యే మంచివారని అసెంబ్లీ లాభీల్లో అనడం అప్పట్లో మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ సంఘటన మినహా ఈ ఇద్దరూ ప్రత్యక్షంగా ఎన్నడూ మాట్లాడుకుంది లేదు. కాకాపోతే ఇప్పుడో న్యూస్ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అపుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన ‘సమరసింహా రెడ్డి’ సినిమా కడపలో దాదాపు యేడాది పైగా నడించింది. ఈ సందర్భంగా 2000వ నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి పేపర్ ప్రకటన ఇచ్చాడని ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో ‘సమరసింహా రెడ్డి’ తెలుగులో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల ఒరవడి మొదలైంది. ఈ సందర్భంగా ‘సమరసింహారెడ్డి’ గోల్డెన్ జూబ్లీ రన్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బాలయ్య కడప జిల్లా అధ్యక్షుడి హోదాలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన ఇచ్చాడనేది ఆ పిక్‌లోని సారాంశం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ..ఈ ఇద్దర్ని అభిమానించే వాళ్లు మాత్రం ఆ పేపర్ కటింగ్‌ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే తాజా సీఎం జగన్ నోరు విప్పాల్సిందే. చూద్దాం జగన్ ఈ వార్తలకు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu