AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: 14 భాషల్లో విడుదలకానున్న అనుష్క హారర్ మూవీ.. కొరియన్‌లో కూడా

ఈఏడాది హారర్ కామెడీగా వచ్చిన శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద భారీ భారీ విజయాన్ని అందుకుంది. స్త్రీ మొదటి పార్ట్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈసినిమా సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Anushka Shetty: 14 భాషల్లో విడుదలకానున్న అనుష్క హారర్ మూవీ.. కొరియన్‌లో కూడా
Anushka
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2024 | 9:36 AM

Share

హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్ కామెడీ కథతో తెరకెక్కే సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. టాలీవుడ్ లో ఇప్పటికే ఈ న్రేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే హిందీలోనూ ఇప్పటికే చాలా సినిమాలు హారర్ బ్యాక్డ్రాప్ లో వచ్చాయి. ఇక ఈఏడాది హారర్ కామెడీగా వచ్చిన శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద భారీ భారీ విజయాన్ని అందుకుంది. స్త్రీ మొదటి పార్ట్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈసినిమా సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే స్త్రీ 2 సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చాలా హారర్ కామెడీ సినిమాలు తీయబోతున్నట్లు బాలీవుడ్ దర్శకనిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఇటీవలే భూల్ భూలయ్యా ఫ్రాంచైజీ మూడవ భాగం కూడా విడుదలైంది, అయితే ఈ రెండు చిత్రాలను బీట్ చేసేలా మరో హారర్ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ హర్రర్ సినిమా పేరు ‘కటనార్: ది వైల్డ్ సోర్సెరర్’.

ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు మరో క్రేజీ మూవీ రానుంది. కటనార్: ది వైల్డ్ సోర్సెరర్ అనే టైటిల్ తో మలయాళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయసూర్య, ప్రభుదేవా మరియు అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. కొంతకాలం క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ని జనాలు బాగా ఆదరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి : మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే

భయానక ప్రపంచంలో ఇంతకు ముందు ఎవరూ చూడని ప్రపంచానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ‘కటనార్: ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ టీమ్ చెప్తుంది. ఈ సినిమాలో అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగించారు. ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేసినట్లు సమాచారం. ఇదొక్కటే కాదు, ఈ సినిమా విశేషమేమిటంటే, ఈ చిత్రం ఒకటి కాదు రెండు కాదు, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, ఇటాలియన్ వంటి 14 భాషల్లో విడుదల కానుంది. రష్యన్, ఇండోనేషియా, జపనీస్ లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ‘కటనార్: ది వైల్డ్ సోర్సెరర్’ దక్షిణాదిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్