Anushka Shetty: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న అనుష్క.. స్వీటీ సినీ జర్నీకి 16ఏళ్ళు..

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న బ్యూటీ అనుష్క. ఈ అమ్మడు ఇండస్ట్రీ కి వచ్చి సరిగ్గా 16 ఏళ్ళు అవుతుంది.

Anushka Shetty: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న అనుష్క.. స్వీటీ సినీ జర్నీకి 16ఏళ్ళు..
Anushka
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2021 | 1:29 PM

Anushka Shetty: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోన్న బ్యూటీ అనుష్క. ఈ అమ్మడు ఇండస్ట్రీ కి వచ్చి సరిగ్గా 16 ఏళ్ళు అవుతుంది. కింగ్ నాగార్జున హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో అనుష్క హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదలై నేటికి 16ఏళ్ళు. ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకున్నారు నాగ్. ఈ సినిమాలో సోనూసూద్ సిస్టర్ గా నటించింది అనుష్క. 16ఏళ్ల ఈ సినీ జర్నీలో ఎన్నో విజయాలను అందుకుంది అనుష్క. సూపర్ సినిమా తర్వాత అనుష్కకు సాలిడ్ హిట్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. రవితేజ హీరోగా జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది అనుష్క. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనుష్కకు ఆఫర్లు క్యూకట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోయింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంది. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

కమర్షియల్ సినిమాలతో పాటులేడీ ఓరియెంటెడ్ మూవీస్ లలో కూడా నటించి మెప్పించింది అనుష్క. అలాగే సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసింది. ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో రుద్రమదేవి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

బాహుబలి సినిమా తర్వాత అనుష్క కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. బాహుబలి సినిమా తరువాత భాగమతి అనే సినిమా చేసింది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న స్వీటీ.. రీసెంట్ గా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ అనుష్క నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే మెగాస్టార్ నటించిన సైరా సినిమాలో జాన్సీ లక్ష్మీ భాయ్ గా చిన్న పాత్రలో కనిపించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ritika Singh: కాలుజారి నీళ్లలో పడిపోయిన హీరోయిన్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన రితిక సింగ్..

Rashmika Mandanna: సౌత్ స్టార్స్‌‌‌‌‌ను వెనక్కినెట్టేసిన లక్కీ బ్యూటీ.. సోషల్ మీడియాలో రష్మిక దూకుడు

Mangli Bonalu Song: బోనాల సాంగ్ వివాదంపై తొలిసారి స్పందించిన సింగర్ మంగ్లీ.. ఆమె మాటల్లోనే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!