Anupama Parameswaran: బాధలో ఉన్నప్పుడు నాకు మొదట గుర్తుకు వచ్చేది అతనే.. ఆ తెలుగు హీరోపై అనుపమ కామెంట్స్

ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఇటీవల సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన టాక్సిక్ రిలేషన్ షిప్ అలాగే బ్రేకప్ స్టోరీ బయట పెట్టిన ఈ అందాల తార తాజాగా ఓ ఇద్దరు హీరోల గురించి గొప్పగా చెప్పింది.

Anupama Parameswaran: బాధలో ఉన్నప్పుడు నాకు మొదట గుర్తుకు వచ్చేది అతనే.. ఆ తెలుగు హీరోపై అనుపమ కామెంట్స్
Anupama Parameswaran

Updated on: Aug 16, 2026 | 2:59 PM

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోన్న ఈ అందాలతారకు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ మధ్యన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవిత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అనుపమ. ఇటీవల తన టాక్సిక్ రిలేషన్ షిప్ అలాగే బ్రేకప్ స్టోరీని చెప్పి కన్నీళ్లు పెట్టుకుందీ అందాల తార. తాజాగా తన కోసం, ఆపదలో ఉన్న ఉన్నప్పుడు ఆదుకునే కొందరు హీరోల గురించి చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘ గత కొద్ది రోజుల నుంచి చాలా మంది నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అయితే నాకు ఏ కష్టమొచ్చినా, నేను పూర్తిగా ఆధారపడగలిగే వ్యక్తి దుల్కర్‌ సల్మానే. నేను డల్‌గా ఉన్న ప్రతిసారీ దుల్కర్‌ నుంచి నాకు మెసేజ్ వస్తుంది. నేను బాధలో ఉన్న విషయం ఆయనకు ఎలా తెలుస్తుందో అని ఆశ్చర్యపోతుంటాను. కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేసేదాన్ని. దుల్కర్ తర్వాత నేను అంతగా నమ్మే మరో వ్యక్తి టాలీవుడ్‌ హీరో రామ్ పోతినేని. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది’ అనుపమ చెప్పుకొచ్చింది.

కాగా దుల్కర్‌ సల్మాన్‌, అనుపమ పరమేశ్వరన్‌ ల మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరు ‘జొమొంటే సువిశేషంగళ్‌’ ( తెలుగులో అందమైన జీవితం) సినిమాలో కలిసి నటించారు. 2017లో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఇదే సందర్భంగా తన రిలేషన్ షిన్, బ్రేకప్ పై కూడా మాట్లాడింది అనుపమ. ‘నార్సిసిస్టిక్ అబ్యూస్ (మానసిక వేధింపుల) అనేది చాలా సైలెంట్‌గా జరుగుతుంది. అలాంటి వాళ్లు ఎప్పుడూ ఇతరులను తమ కంట్రోల్‌లో ఉంచుకోవాలని చూస్తారు. నా మాజీ ప్రియుడి వల్ల నేను ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాను’ అని అనుపమ వాపోయింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

అనుపమ రీసెంట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

ఇక సినిమాల విషయానికి వస్తే..  ఈ ఏడాద ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది అనుపమ. లాక్ డౌన్, మరీచిక అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న భోగి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us