Anupama Parameswaran: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మలయాళీ ముద్దుగుమ్మ.. వైరల్ అవుతోన్న ఫొటోస్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనుపమ పరమేశ్వరన్. తొలిసినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపేసింది అనుపమ. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Anupama Parameswaran: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మలయాళీ ముద్దుగుమ్మ.. వైరల్ అవుతోన్న ఫొటోస్..
Anupama

Updated on: Jul 07, 2022 | 5:55 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). తొలిసినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపేసింది అనుపమ. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కుర్ర హీరోలందరి సరసన నటించింది ఈ బ్యూటీ. అవవడానికి కేరళ కుట్టినే అయినా  చూడటానికి అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది ఈ బ్యూటీ. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమా విషయాలతోపాటు వ్యక్తిగత విషాలను కూడా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అలాగే రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది అనుపమ.

తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండీగా రెడీ అయిన అనుపమ రకరకాల ఫోజులో ఫోటోలు దిగి షేర్ చేసింది అనుపమ. అనుపమ ఫోటోలు చేసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో…’ అంటూ పాటలు పాడుకుంటున్నారు. అంతలా మైమరిపిస్తోంది ఈ అమ్మడు. ఇక అనుపమ సినిమాల  విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తోన్న కార్తికేయ 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. అలాగే నిఖిల్ కు జోడీగానే మరో సినిమాలోనూ నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్న 18 పేజెస్ సినిమాలో కూడా నటిస్తుంది అనుపమ. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి