
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఎక్కడో చూసినట్లుంది కదూ. ఎక్కడో కాదండి. ఈ చిన్నారిని మీరు సిల్వర్ స్క్రీన్ మీదే చూశారు. ఆఫ్ కోర్స్ ఈ ఏజ్‌లో కాదనుకోండి. ఈ పాప ఎవరో కాదు ప్రస్తుత హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది. తను మరెవరో కాదు. వెండితెర మీద అగరొత్తుల కురులే దువ్వి మాయ చేస్తున్న చేప కళ్ల సుందరి అనుపమా పరమేశ్వరనే. 2015లో అల్ఫోన్స్ పుత్రన్ డైరెక్ట్ చేసిన మలయాళ మూవీ “ప్రేమమ్” ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అ.. ఆతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ ఆర్టిస్ట్ చిన్నప్పటి పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకుముందు అనుపమ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉండేవారు కాదు. లాక్ డౌన్ టైంలో పూర్తిగా ట్రెండ్ మార్చేశారు. ఈ టైంలో స్లిమ్ లుక్ లోకి మారిపోయిన ఈ మలయాళ కుట్టి వరుస ఫోటో షూట్లతో ఇన్స్టాలో హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో మాత్రం అనుపమ గ్లామర్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్.
టిల్లు స్క్వేర్ సినిమాతో అందాల గేట్లు తెరిచేసిన అనుపమ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆ తర్వాత ఎందుకో ఈ బ్యూటీ స్లో అయింది. కెరియర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు గ్యాప్ తీసుకోకూడదు. తప్పక గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా ఎక్కడో ఒకచోట ఫిల్ చేసేయాలి. ఈ విషయం మీద అనుపమా పరమేశ్వరనికి సజెషన్స్ ఇచ్చేస్తున్నారు నెటిజన్స్. టిల్లు స్కేర్ తర్వాత అనుపమాను మిస్ అవుతున్నారు తెలుగు ఫ్యాన్స్. ఆమె చేతిలో సినిమాలు ఉన్న విషయం తెలుస్తూనే ఉన్నా పదే పదే ప్రమోషన్స్ లో గాని సోషల్ మీడియాలో గాని కనిపించడం లేదు ఈ భామ. ఆ మధ్య డైరెక్షన్ మీద కూడా దృష్టి పెట్టారు ఈ బ్యూటీ. మీ గోల్స్ ని మేం కాదనం. కానీ సినిమాలు కూడా కాస్త స్పీడ్ గా చేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు అభిమానులు. ప్రదీప్ రంగనాథన్ తో అనుపమా నటిస్తున్న డ్రాగన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అనుపమా ఉండడం వల్ల ఈ సినిమాకు తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.