బేబీ బంప్‌తో అనుపమ పరమేశ్వరన్ షాక్ ఇవ్వదమేంటి.? ఆ ఫోటో నెట్టింట వైరల్ కావడం ఏంటనే కదా.! మీ డౌట్.. అయితే ఈ స్టోరీ చదవండి మీకు అర్ధమవుతుంది. అనుపమ తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఇక అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో అనుపమ బేబీ బంప్‌తో చిరునవ్వులు చిందిస్తుంటే.. పక్కనే ఆమె తండ్రి కూడా ఉన్నారు. ఇదేంటి అనుపమ(Anupama Parameswaran)కు పెళ్లి ఎప్పుడైంది.? ఈ బేబీ బంప్ ఏంటి అని కన్ఫ్యూజ్ కావొద్దు. ఇది రియల్ బేబీ బంప్ కాదులెండి. 2019లో విడుదలైన ‘మనియారాయిలేఅశోకన్’ అనే మలయాళ చిత్రం కోసం తీసుకున్న ఫోటో ఇది. కాగా, ఈ త్రోబ్యాక్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ‘కంగ్రాట్స్ అనుపమ’ అంటూ ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ. మొదటి సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచేసుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రతీ సినిమాకూ తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది. తాజాగా ‘రౌడీ బాయ్స్’ సినిమాతో అలరించిన అనుపమ.. త్వరలో ’18 పేజీస్’, ‘కార్తీకేయ 2’, ‘హెలెన్’ మూవీస్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.