పక్కింటి అమ్మాయిలానే ఉంటుంది. కుర్రకారు మనుసులను ఇట్టే దోచేస్తుంది. ప్రేమమ్ సినిమాతో పరిచయమై ప్రేక్షలను మెప్పించింది. ఆమే అందాల అనుపమా పరమేశ్వరన్. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోల పక్కన నటిస్తూ సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఆర్థిక అంశాల విషయంలో తన ఆలోచనలు ఎలా ఉంటాయో వెల్లడించింది.
“చిన్నప్పటి నుంచి నేనూ ఓ సగటు మిడిల్ క్లాస్ అమ్మాయిలాగే పెరిగా. అందుకే ఆర్థికపరమైన విషయాల్లో నాకు బాగా అవగాహన ఉంది. కానీ, అదే పనిగా వాటి గురించి పట్టించుకోను. నాకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో తెలుసు. కానీ, ఆ తర్వాత విషయాలన్నీ మా పేరెంట్స్ చూసుకుంటారు. వ్యక్తిగతంగా బతకాలంటే ఎక్కువ డబ్బు అవసరం లేదనేది నా అభిప్రాయం. అయినా నాకు డబ్బుతో పెద్దగా పనేం ఉంటుంది? షాపింగ్ అంటే ఇష్టం లేదు. అప్పుడప్పుడు బయటకి వెళ్లను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలేమో అనిపిస్తుంది. యాక్టింగ్, సినిమా.. ఈ రెండు తప్ప నాకు మరో పిచ్చి లేదు. ప్రయాణించడానికి ఒక కారు, ఉండటానికి మంచి ఇల్లు చాలు” అని చెప్పుకొచ్చింది.
Also Read :
వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !