నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా 'వి'. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా! ''సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు తాజాగా ట్వీట్ చేశాడు నాని. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో...
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా ‘వి’. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా! ”సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు తాజాగా ట్వీట్ చేశాడు నాని. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం ఇలా విడుదల కానుండటం కూడా గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందామంటూ” అభిమానులను ఉద్ధేశించి ఓ లేఖను ట్విట్టర్‌లో నాని చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీనే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. నాని హీరోగా నటించిన మొదటి సినిమా ”అష్టా చమ్మా 2008 సెప్టెంబర్ 5న” విడుదల అయ్యింది. అంటే ‘వి’ విడుదల రోజుకి నాని సినీ ప్రయాణం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అందుకే ఆ రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాల్లో నటించబోతున్నాడు.
కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ‘వి’ సినిమాలో సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ కీలక పాత్రల్లో నటించారు.
Read More:
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని.. వైసీపీ ఎమ్మెల్యే పూజలు