చాలా రోజుల బ్రేక్ తర్వాత తిరిగి గేమ్ ఛేంజర్ షూటింగ్లో జాయిన్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పనుల కోసం ఈ మూవీ చిత్రీకరణకు బ్రేక్ తీసుకున్నారు చరణ్. ఇప్పుడు తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. నిన్న ప్రైవేట్ జెట్ లో మైసూర్ చేరుకున్నారు చరణ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. గురువారం మైసూర్ లో కొత్త షెడ్యూల్ మొదలైంది. అక్కడ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి కొన్ని వీడియోస్ లీక్ అయ్యాయి.
ఈ వీడియోలో రామ్ చరణ్ సూటు, బూటు వేసుకొని క్లీన్ షేవ్ తో జెంటిల్మేన్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఒకటి రాజకీయన నాయకుడిగా మరొకటి IAS పాత్రలో అని సమాచారం. అయితే ఇప్పుడు లీక్ అయినా వీడియోలో చెర్రీ లుక్ చూస్తుంటే ఐఏఎస్ పాత్రకు సంబంధించిన షూట్ అనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఫోటోస్, వీడియోస్ లీక్ కావడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ అనేక సార్లు గేమ్ ఛేంజర్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.
Leaked alert😄😄#GameChanger
Ram Charan Annaya IAS GETUP
Mysore Shooting@AlwaysRamCharan pic.twitter.com/YFXsWwYOhf— Raj Charan 🦁⚡🔥 (@alwaysrajcharan) November 23, 2023
కొన్ని సార్లు చరణ్ స్టైలీష్ లుక్ లో కనిపించగా.. మరికొన్ని ఫోటోల్లో పల్లెటూరి వ్యక్తిలా తెల్ల షర్ట్, పంచెతో కనిపించారు. ఇలా చాలా రకరకాల పాత్రలలో కనిపించారు చరణ్. దీంతో అసలు గేమ్ ఛేంజర్ చిత్రంలో చరణ్ ఎన్ని వెరియేషన్స్ చూపిస్తాడో అంటున్నారు ఫ్యాన్స్. గేమ్ ఛేంజర్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక ఈ మూవీ తర్వాత చరణ్.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించనుందని.. అలాగే జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.
Oka movie lo inni variations 🥵#GameChanger MASSSSSS LOOKS🔥💥💥
I. A.S RAM NANDAN ON DUTYYY 🔥🔥#ManOfMassesRamCharan 🦁👑 pic.twitter.com/MKMRKMTJIX
— 🌟RCharan🔥🌟 REDDY 🔥⭐PRECIDENT OF RAM CHARAN FAN (@CharanR12520030) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.