Vijay Thalapathy: మరోసారి హిట్ కాంబో రిపీట్.. విజయ్..లోకేష్ మూవీలో మరో స్టార్ హీరో ?..

|

Jun 11, 2022 | 6:07 PM

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ జూన్ 3న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

Vijay Thalapathy: మరోసారి హిట్ కాంబో రిపీట్.. విజయ్..లోకేష్ మూవీలో మరో స్టార్ హీరో ?..
Vijay Lokesh
Follow us on

మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ సినిమాతో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు విక్రమ్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ జూన్ 3న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలోనే కాకుండా ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. విక్రమ్ సినిమాతో మరోసారి సెన్సెషన్ సృష్టించిన లోకేష్.. తన తదుపరి ప్రాజెక్ట్ తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతితో చేయనున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన మాస్టర్ మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తెలుగులో నేరుగా ఓ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న ద్విభాష చిత్రం ఏకకాలంలో తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ తర్వాత విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ కాకుండా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడట. లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోయే ఈ మూవీలో విజయ్‏తోపాటు తమిళ్ స్టార్ హీరో ధనుష్ సైతం కీలకపాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇందులో ధనుష్ పాత్ర సరికొత్తగా ఉంటుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.