సినిమా హిట్ కావడానికి ఎన్ని రకాల అవకాశాలుంటాయో అన్నిటిని గురించి ఆరా తీస్తారు అభిమానులు. ఇప్పుడు సినిమాకు మిడాస్ టచ్ ఇచ్చే మ్యూజిక్ డైరక్టర్‌గా ట్రెమండస్ సక్సెస్ రేషియో దూసుకుపోతున్నారు అనిరుద్. సూపర్‌స్టార్స్, యంగ్‌స్టర్స్ అనే తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్టులన్నిటికీ నేనే మ్యూజిక్ అంటున్నారు ఈ యంగ్‌స్టర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుమ్మేయాలి. సౌండ్‌తో స్క్రీన్లు చినిగిపోవాలంటే నిన్నమొన్నటిదాకా మన ముందున్న మ్యూజికల్ ఆప్షన్ పేరు తమన్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ తమన్ స్కోర్ అమాంతం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ మాటను బీట్ చేయడానికి నేనున్నా.. స్కోర్ షేరింగ్‌కి సిద్ధంగా ఉండండి అనే వాయిస్ వినిపిస్తోంది అనిరుద్ నుంచి. వా… నువ్ కావాలయ్యా అని స్క్రీన్ మీద అన్నది తమన్నానే అయినా.. మేకర్స్ మాత్రం అనిరుద్ వైపు చూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి