
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు డార్లింగ్. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాలతోపాటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ వచ్చేసింది. అఫీషియల్ ప్రకటన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని.. ఈ మూవీలో కనిపించే హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తుందని.. ఆమెతోపాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారని టాక్ నడిచింది. ఇటీవలే స్పిరిట్ నుంచి దీపికాను తొలగించారనే ప్రచారం సైతం చక్కర్లు కొట్టింది. తాజాగా స్పిరిట్ మూవీ హీరోయిన్ ఎవరనేది అధికారిక ప్రకటన వెల్లడిస్తూ రూమర్స్ కు చెక్ పెట్టారు మేకర్స్.
ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి నటించనున్నట్లు టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. స్పిరిట్ మూవీని రిలీజ్ చేసే అన్ని భాషల్లో ఆమె పేరును ఓ పోస్టర్ పై రిలీజ్ చేశారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి నేషనల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి. ఇప్పుడు మరోసారి ఆమెకే ఛాన్స్ ఇచ్చారు సందీప్ రెడ్డి. యానిమల్ సినిమాతోనే ఇండియా వైడ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిప్తి.. ఇప్పుడు ప్రభాస్ మూవీతో మరింత క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
స్పిరిట్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..