Ranbir Kapoor Birthday: రణబీర్ కపూర్ బర్త్ డే.. అలియా భర్తకు ఎంత ఆస్తి ఉందో తెలుసా.. ?

|

Sep 28, 2024 | 11:54 AM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీతో అటు మాస్ హీరోగానూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామాయణం చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే త్వరలోనే యానిమల్ పార్క్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు (సెప్టెంబర్ 28న) రణబీర్ కపూర్ 42వ పుట్టినరోజు.

Ranbir Kapoor Birthday: రణబీర్ కపూర్ బర్త్ డే.. అలియా భర్తకు ఎంత ఆస్తి ఉందో తెలుసా.. ?
Ranbir Kapoor, Alia Bhatt
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరో.. గతేడాది విడుదలైన యానిమల్ సినిమాతో సౌత్ అడియన్స్‏కు దగ్గరయ్యాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీతో అటు మాస్ హీరోగానూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామాయణం చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే త్వరలోనే యానిమల్ పార్క్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు (సెప్టెంబర్ 28న) రణబీర్ కపూర్ 42వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ హీరోకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. అలాగే రణబీర్ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ.. అతడి నెట్ వర్త్ గురించి ఆరా తీస్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత రణబీర్ కపూర్ తన సినిమా రెమ్యునరేషన్ పెంచాడు.

ప్రస్తుతం రణబీర్ ఆస్తులు రూ.345 కోట్లు ఉన్నట్లు సమాచారం. రణబీర్ కపూర్ వార్షిక సంపాదన రూ.30 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటాడు. అంతకుముందు విడుదలైన ‘యానిమల్‌’కి రూ.60 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. రణబీర్ కు క్రీడలంటే చాలా ఇష్టం. అందుకే ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుకు యజమాని. అతనికి 35 షేర్లు ఉన్నాయి. ఫుట్‌బాల్‌పై కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే తన కూతురు పేరును ఫుట్ బాల్ షర్ట్ పై తెలిపాడు. రణబీర్ కపూర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌ని కలిగి ఉన్నాడు. అదే సావన్ కంపెనీ. 2014 నుంచి యజమానిగా ఉన్నాడు.

టెక్ పరిశ్రమలో పెట్టుబడులు కూడా ఉన్నాయి. పూణెకు చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టినట్లుగా సమాచారం. అలాగే చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ముంబైలోని బాంద్రాలో నాలుగు బిహెచ్‌కె ఇల్లు ఉంది. పూణెలో 13 కోట్ల ఫ్లాట్, ఈ ఫ్లాట్ ట్రంప్ టవర్‌లో ఉంది. 48 లక్షల రూపాయలకు అద్దెకు తీసుకున్నాడు. బ్రాండ్ ప్రమోషన్ కోసం రణబీర్ కపూర్ రూ.6 కోట్లు అందుకున్నాడు. ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.