Vakeel Saab Movie: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ‘వకీల్‌ సాబ్’కు షాక్.. కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం..

|

Apr 10, 2021 | 8:18 PM

Vakeel Saab Movie: అంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ‘వకీల్ సాబ్‌’కి గట్టి షాక్ తగిలింది. సినిమా టికెట్ ధరలు పెంచొద్దని స్పష్టం చేసింది.

Vakeel Saab Movie: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ‘వకీల్‌ సాబ్’కు షాక్.. కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం..
Vakeel Saab
Follow us on

Vakeel Saab Movie: అంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ‘వకీల్ సాబ్‌’కి గట్టి షాక్ తగిలింది. సినిమా టికెట్ ధరలు పెంచొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ధరలు ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ‘వకీల్‌ సాబ్’‌ సినిమా టికెట్‌ రేట్ల పెంచుకోవచ్చంటూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. అయితే, పెంచిన ధరల ప్రకారం.. ఆన్‌లైన్‌లో బుక్ అయిన టికెట్ల విషయంలో ఆదివారం షోల వరకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా శుక్రవారం నాడు థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రికి రాత్రే బెనిఫిట్ షోలు వేయకూడదని, టికెట్స్ రేట్స్ పెంచకూడదని సర్కార్ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి ఏకంగా జీవో ని జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే, ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ మూవీ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. మూడు రోజులపాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చని తీర్పు వెల్లడించింది. ఏపీ సర్కార్ ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన డివిజన్ బెంచ్ ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. టికెట్ ధరల పెంపు కేవలం శనివారానికే వర్తింపజేయాలని స్పష్టం చేసింది. సినిమా టికెట్ ధరలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఉంటాయని స్పష్టం చేసింది.

Also read:

హృదయ విదారకం.. పిల్లలు లేరు.. 30 ఏళ్ల క్రితమే భార్య సమాధి పక్కన తన సమాధి సైతం నిర్మించుకున్న వైనం

Rahul Dravid: నడిరోడ్డుపై రాహుల్ ద్రావిడ్ హల్‌చల్.. క్రికెట్‌ బ్యాట్‌తో కారు ధ్వంసం.. ‘గాంధీ నగర్‌కా గూండా’నంటూ..

తన ఊపిరితిత్తులు కరోనా సోకిన భార్యకు ఇచ్చి ఊపిరి పోసిన భర్త.. జపాన్ లో సక్సెస్ అయిన లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్!